Also Read: ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళ.. హైకోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో..!
అయితే, అది 2022లో బెంగాల్ బహదూర్‌పుర అనే ప్రాంతంలో రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియోగా ఈసీ తేల్చింది. దీంతో నిన్న సాయంత్రం తన ఆఫీస్‌లో ఉన్న శ్రవణ్‌ను మఫ్టీలో ఉన్న పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. మిగిలినవారిని కూడా వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు. అయితే, కార్పొరేటర్ శ్రవణ్‌తో పాటు వారంతా కిడ్నాప్ అయినట్టు ప్రచారం జరిగింది.
Also Read: పోలింగ్ తర్వాత తొలిసారిగా స్పందించిన పవన్ కళ్యాణ్..!
శ్రవణ్ కిడ్నాప్‌పై ఆయన కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రవణ్‌కుమార్‌ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని ఆయన తండ్రి మల్కాజ్‌గిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. శ్రవణ్ ఆఫీస్‌కు సమీపంలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే..
వారు మఫ్టీలో వచ్చిన పోలీసులుగా గుర్తించారు. రాత్రి 8గంటలకు శ్రవణ్‌తో సహా నలుగురిని తామే అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు