/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/priya-jpg.webp)
Malayalam actress priya who was 8 months pregnant died: మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. టీవీ నటి ప్రియ (35) తాజాగా కన్నుమూశారు. ఎనిమిది నెలల గర్భవతి అయిన ఆమె మంగళవారం రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లి కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె సహ నటుడు కిషోర్ సత్య సోషల్ మీడియాలో వెల్లడించారు.
Also Read: పెనుగొండలో మహిళ దారుణ హత్య..మొగుడే యముడా..!
‘‘మలయాళీ టీవీ ఇండస్ట్రీలో ఊహించని విధంగా మరొకరు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్‌తో ప్రియ కన్నుమూశారు. ఆమె ఎనిమిది నెలల ప్రెగ్నెంట్. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియ కార్డియాక్ అరెస్ట్‌కు గురై మరణించారు. అయితే, వైద్యులు తక్షణం స్పందించి శిశువును బయటకు తీశారు. ప్రస్తుతం శిశువు సురక్షితంగా ఉంది. చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబసబ్యుల ఆవేదన నన్నెంతో కలచివేసింది. వాళ్లను ఎలా ఓదార్చాలో నాకు అర్థంకాలేదు. మంచి వాళ్లకు భగవంతుడు ఇంతటి అన్యాయం ఎందుకు చేస్తాడో?’’ అంటూ ఆయన నెట్టింట పోస్ట్ పెట్టారు.
వైద్య విద్య చదువుకున్న ప్రియ సీరియల్ నటిగా మలయాళంలో టీవీ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కరుతముత్తు అనే సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పెళ్లి తరువాత ఆమె నటనకు దూరంగా ఉంటున్నారు. ఆమె మృతిపట్ల మలయాళ నటీనటులు, ఫ్యాన్స్ దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. కాగా, రిసెంట్ గా టీవీ సీరియల్స్‌తోపాటు పలు సినిమాల్లో నటించి మెప్పించిన రెంజూష మీనన్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇలా వరుస మరణాలు మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపుతున్నాయి.