ఈ ట్రిక్ తో ప్రెషర్ కుక్కర్ లో రోటీలు రెడీ !

ప్రెజర్ కుక్కర్‌లో రోటీల తయారు చేసే కొత్త పద్దతులు వచ్చాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇవి చాలా పాపులర్. మరీ ఈజీగా రోటీలను ఎలా తయారు చేయాలో చూద్దాం..

New Update
ఈ ట్రిక్ తో ప్రెషర్ కుక్కర్ లో రోటీలు రెడీ !

ప్రస్తుతం రోటీలను ప్రతి ఇంట్లో తయారు చేసుకుంటున్నారు. రోటీలను మామూలుగా పప్పు కూరగాయలు లేదా ఏదైనా కూరతో ఎంతో ఇష్టంగా తింటారు. కడుపు నింపడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని భావిస్తారు. ప్రతి ఇంట్లో రోటీలను రోజువారీ ఆహారంలో చేర్చడానికి ఇదే కారణం. అయితే, రోజూ రోటీలను చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా వేసవిలో, వాటిని పొయ్యి మీద కాల్చడం చాలా కష్టమైన పని. అటువంటి పరిస్థితిలో, ప్రజలు తరచూ కొత్తగా, సింపుల్‌గా చేసేందుకు ఏమైనా ఉపాయాలు ఉన్నాయో చూస్తారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌‌లో రోటీలను తయారు చేయడం అనేది చాలా పాపులర్ అయ్యింది. ఈ పద్దతిలో మీరు నిమిషాల్లో చాలా రోటీలను తయారు చేయవచ్చు.

ప్రెజర్ కుక్కర్‌లో రోటీలను తయారు చేయూ విధానం :

ముందుగా పిండిని, నీళ్ల సహాయంతో మెత్తగా తయారు చేసి, కాసేపు మూతపెట్టి ఉంచండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు బాల్స్‌ లాగా కట్ చేసి చపాతీలు చేయండి. ఈ రోల్ చేసిన రోటీలను ఒక ప్లేట్‌లో ఉంచండి. ఈ రోటీలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే, వాటిపై పొడి పిండిని బాగా రాయండి.

ఇక ఒక పెద్ద సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక గిన్నెలో ఉప్పు వెయ్యండి. ఇప్పుడు ఉప్పు మీద మీడియం సైజు గిన్నె ఉంచండి. రోటీ సైజులో ఫ్లాట్ స్టీల్ బాక్స్ తీసుకుంటే బాగుంటుంది. ప్రెజర్ కుక్కర్ వేడెక్కినప్పుడు, తలక్రిందులుగా ఉంచిన గిన్నెపై రోటీలన్నింటినీ జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత మూసివేయండి. దానిపై విజిల్ ఉండకుండా చూసుకోండి. విజిల్ ఉంటే ప్రమాదం.ఈ విధంగా రోటీలు 3 నుండి 4 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌ని పొయ్యి మీద నుండి తీసివేసి, నెమ్మదిగా మూత తెరవండి. టంగ్స్ సహాయంతో రోటీలను జాగ్రత్తగా తీసివేసి, వేడిగా వడ్డించండి. అయితే, దీన్ని తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Advertisment
తాజా కథనాలు