Makeup Essentials: అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు.. క్యారీ చేయాల్సిన ఐదు మేకప్ ఎసెన్షియల్స్

అమ్మాయిలు బయటకు వెళ్ళినప్పుడు ఈ ఐదు ట్రావెల్ మేకప్ ఎసెన్షియల్స్ తప్పకుండా క్యారీ చేయాలి. ఇవి మిమల్ని తాజాగా ఉంచడంతో పాటు.. మీలో ఆత్మ విశ్వసాన్ని కూడా పెంచుతాయి. వెట్ వైప్స్ , లిప్ స్టిక్, ఫౌండేషన్ విత్ బ్లెండర్, లిప్ బామ్, బ్లష్ లేదా చీక్ టింట్.

Makeup Essentials: అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు.. క్యారీ చేయాల్సిన ఐదు మేకప్ ఎసెన్షియల్స్
New Update

Makeup Essentials: సాధారణంగా అమ్మాయిలు ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు.. వాళ్ళ మేకప్ కు సంబంధించిన అన్ని ప్రాడక్ట్స్ క్యారీ చేయాలనీ అనుకుంటారు. అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం అమ్మాయిల ఆత్మ విశ్వసాన్ని పెంచుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అన్నీ వస్తువులను క్యారీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఈ ఐదు ట్రావెల్ మేకప్ ఎసెన్షియల్స్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఇవి మిమల్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచడంతో పాటు ఆత్మ విశ్వసాన్ని కూడా పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

వెట్ వైప్స్

ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సోప్స్, ఫేస్ వాష్ బదులు వెట్ వైప్స్ క్యారీ చేయడం బెస్ట్ అప్షన్. వీటిని సులభంగా క్యారీ చేయొచ్చు. సోప్, ఫేస్ వాష్ తో పనిలేకుండా మొహం పై చెమట, అధిక ఆయిల్స్ ను వీటితో శుభ్రం చేసుకోవచ్చు. అలాగే మేకప్ రిమూవ్ చేయడానికి.. మేకప్ సెట్ చేయడానికి కూడా ఇవి అద్భుతంగా పని చేస్తాయి.

లిప్ స్టిక్

మీరు ఎల్లప్పుడూ ఉపయోగించే లిప్ స్టిక్ షేడ్స్ మాత్రమే బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలి. అందానికి మరింత గ్లామర్ యాడ్ చేసే బ్యూటీ ప్రాడక్ట్స్ లో లిప్ స్టిక్ ఒకటి. హెయిర్ స్టైల్, ఐ మేకప్, డ్రెస్సింగ్ తో సంబంధం లేకుండా.. లిప్ స్టిక్ ఎల్లప్పుడూ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. లిప్ స్టిక్ లో బోల్డ్ షేడ్స్ ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే బయటకు వెళ్ళినప్పుడు లిప్ స్టిక్ క్యారీ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

publive-image

బ్లష్ లేదా చీక్ టింట్

ప్రయాణంలో అప్లై చేయడానికి సులభమైన మేకప్ లో బ్లష్, లేదా చీక్ టింట్ ఒకటి. ఇది అప్లై చేయడం ద్వారా బుగ్గల పై మంచి గ్లోనీ అందిస్తుంది. బ్లష్ స్కిన్ టోన్ ను ఆకర్షణీయంగా మార్చడంతో పాటు ఎల్లప్పుడూ స్టైలిష్ ఇంకా అందమైన లుక్ ను అందించడంలో సహాయపడుతుంది.

లిప్ బామ్

ఇది పెదవులు పొడిగా, క్రాక్స్ రాకుండా.. మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా మీ ట్రావెల్ బ్యాగ్ క్యారీ చేయడం మంచిది. ముఖ్యంగా వింటర్ సీజన్ లో ఔటింగ్ వెళ్ళినప్పుడు లిప్ బామ్ తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఫౌండేషన్ విత్ మేకప్ బ్లెండర్

చర్మం అందంగా, నిగారింపుగా కనిపించాలనేది ప్రతీ అమ్మాయికి ఉండే సహజమైన కోరిక. దాని కోసం ఫౌండేషన్ క్యారీ చేయడం తప్పనిసరి. ఎక్కడికైనా ఒక రోజు కంటే ఎక్కువ సమయం ట్రావెల్ చేసినప్పుడు.. తిరిగి మళ్ళీ ఫ్రెష్ గా కనిపించడానికి... మీ బ్యాగ్ లోని ఈ ఐదు మేకప్ ఎసెన్షియల్స్ అప్లై చేస్తే మీ మొహం తాజాగా, నిగారింపుగా తయారవుతుంది.

Also Read: Grey Hair Tips: జుట్టు నల్లగా మారాలంటే నల్ల జీలకర్ర ఫ్యాక్స్ ట్రై చేయండి

#makeup-essentials #makeup-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe