Gautam: అచ్చం తండ్రిలానే.. మహేశ్‌ తనయుడు గౌతమ్‌ ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

తన తనయుడు గౌతమ్‌ని చూసి ఎంతగానో గర్వపడుతున్నానంటున్నారు మహేశ్‌ బాబు భార్య నమ్రత. గౌతమ్‌ ఇటివలే రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులను పలకరించాడు..వారిని నవ్వించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అవి కాస్త వైరల్‌గా మారాయి. MB ఫౌండేషన్‌ ద్వారా ఎంతోమందికి గుండె ఆపరేషన్లు చేయించారు మహేశ్‌బాబు.

New Update
Gautam: అచ్చం తండ్రిలానే.. మహేశ్‌ తనయుడు గౌతమ్‌ ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

mahesh babu son gautam photos viral: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబు చేసే సోషల్‌సర్వీస్‌ వెలకట్టలేనిది. రెయిన్ బో హాస్పిటల్స్, ఆంధ్ర హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఎంబీ ఫౌండేషన్(MB Foundation) అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎంతోమంది చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు చేయించారు మహేశ్‌బాబు. ఎప్పుడు ఎంత చేసినా సైలెంట్‌గానే ఉంటారు. మహేశ్‌ తనయుడు గౌతమ్‌ని చూసినా అదే ఫీలింగ్‌ కలుగుతుంది. గౌతమ్‌ కూడా చాలా సైలెంట్‌.. మహేశ్‌ గారాలపట్టి సీతార నెట్టింట్లో అల్లరి చేస్తుంటుంది కానీ.. గౌతమ్‌ మాత్రం సోషల్‌మీడియాలో ఎక్కువ కనిపించడు.. అయితే ఇటివలే రెయిన్‌బో ఆస్పత్రిని విజిట్ చేశాడు గౌతమ్‌. తన ఫౌండేషన్‌ ద్వారా చికిత్స తీసుకుంటున్న చిన్నారులను పలకరించాడు. ఇది చూసి గౌతమ్‌ తల్లి నమ్రత ఎంతగానో మురిసిపోయారు.

publive-image డాక్టర్ తో మాట్లాడుతున్న గౌతమ్ (Image source instagram/namratashirodkar)

గర్వపడుతున్నా: నమ్రత
తన కొడుకు గౌతమ్ ఘట్టమనేనిని చూసి గర్వపడుతున్నానని అలనాటి నటి, మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పోస్ట్‌ను షేర్ చేశారు. గౌతమ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. "నా కొడుకుని చూసి చాలా గర్వంగా ఉంది!" అని క్యాప్షన్ ఇచ్చారు.

publive-image చికిత్స పొందుతున్న చిన్నారులతో ముచ్చటిస్తున్న గౌతమ్ (Image source instagram/namratashirodkar)

"మా ఫౌండేషన్‌లో అంతర్భాగమైన గౌతమ్, ఆంకాలజీ, కార్డియో వార్డులలో పిల్లలతో సమయాన్ని గడుపుతాడు. క్యాన్సర్‌ బారిన పడిన పిల్లల్లో గుండె ధైర్యాన్ని నింపుతాడు. వాళ్ల కోసం బహుమతులు తీసుకెళ్తాడు. చిరునవ్వులను చిందించే చిన్నారులను చూసి తను ఎంతో ఆనందిస్తాడు. ఇలా చేయడం వల్ల చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకుంటుంటారు. వాళ్లకు అండగా నిలుస్తున్నందుకు గౌతమ్‌కు థ్యాంక్స్‌’ అని నమ్రత పోస్ట్ చేశారు.

publive-image చిన్నారుల వివరాలు అడిగి తెలుసుకుంటున్న గౌతమ్ (Image source instagram/namratashirodkar)

సేమ్‌ మహేశ్‌బాబు లాగే:
నమ్రత పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. గౌతమ్‌ని మెచ్చుకుంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. మహేశ్‌ బాబు లాగే గౌతమ్‌ మనసు కూడా బంగారమని అంటున్నారు. ఇక గౌతమ్ ఆసుపత్రిలో పిల్లలను పరామర్శించాడు. హస్పిటల్‌ బెడ్‌పై కూర్చున్నప్పుడు గిఫ్ట్‌ని తెరిచిన పిల్లవాడిని చూసి గౌతమ్ నవ్వుతూ కనిపించాడు. అతను ఒక డాక్టర్‌తో సంభాషించడం కూడా ఫొటోల్లో కనిపించింది. ఈ ఫొటోలు చూస్తున్న మహేశ్‌ ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు. అటు నమ్రత తన కుటుంబ సభ్యుల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో క్రమం తప్పకుండా షేర్ చేస్తూ ఉంటారు. ఈ నెల(ఆగస్టు) ప్రారంభంలో మహేశ్‌ ఫ్యామిలీ స్కాట్లాండ్‌ను సందర్శించింది. మహేష్, గౌతమ్, సితారతో సెల్ఫీని షేర్ చేస్తూ, "ఎ జర్నీ త్రూ టైమ్!! ఎక్స్‌ప్లోరింగ్ #ఎడిన్‌బర్గ్‌క్యాజిల్...ఆర్కిటెక్చర్!! #స్కాట్లాండ్" అని రాశారు నమ్రత. జూలైలో, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్, గౌతమ్, సితార నవ్వుతూ కెమెరాకు పోజులిచ్చారు. ఆమె పోస్ట్‌కి "మేకింగ్ మెమరీస్...#లండన్" అని క్యాప్షన్ ఇచ్చారు.

ALSO READ: ఆరుపదుల నవమన్మధుడు.. టాలీవుడ్ కింగ్

#mahesh-babu-son #mahesh-son-gautam
Advertisment
Advertisment
తాజా కథనాలు