Kareena Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు!

Kareena Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు!
New Update

Big Shock To Kareena Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి భారీ షాక్ తగిలింది. మధ్య ప్రదేశ్ కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. అందుకు కారణం కరీనా కపూర్ రాసిన ఓ పుస్తకమే. తాను రాసిన పుస్తకంలో ఓ పదాన్ని తప్పుగా వాడినట్లు ఓ అడ్వకేట్ కోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే...

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కి తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకం రాసిన కరీనా పై కోర్టులో పిటీషన్ దాఖలైంది. బుక్ టైటిల్ లో 'బైబిల్' అన్న పదాన్ని వాడటాన్ని తప్పు పడుతూ ఓ అడ్వకేట్ కోర్టులో కేస్ వేసాడు. క‌రీనా క‌పూర్‌పై కేసు న‌మోదు చేయాల‌ని అడ్వ‌కేట్ క్రిస్టోఫ‌ర్ ఆంథోనీ పిటీష‌న్ వేశారు.

Also Read : ప్రభాస్ ‘కల్కి’ సినిమాకి ఎలక్షన్ ఎఫెక్ట్.. వైరల్ అవుతున్న నిర్మాత పోస్ట్!

కరీనా కపూర్ పై కేసు న‌మోదు

ఈ కేస్ లో జ‌స్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం తీర్పును వెలువరించింది. పుస్తకం టైటిల్‌లో బైబిల్ అన్న ప‌దాన్ని ఎందుకు వాడార‌ని? కోర్టు ప్ర‌శ్న‌లు వేసింది. అంతేకాకుండా పుస్త‌కంపై బ్యాన్ విధించాల‌ని అడ్వ‌కేట్ ఆంధోనీ డిమాండ్ చేయడంతో కోర్టు ఆ పుస్తకం అమ్మకందారులకు సైతం నోటీసులు పంపించింది.

జ‌బ‌ల్‌ పుర్‌కు చెందిన సామాజిక కార్య‌క‌ర్త ఆంథోనీ బుక్ టైటిల్ లో బైబిల్ అనే పదాన్ని వాడి క్రైస్తవ సమాజ మనోభావాలను దెబ్బతీసినట్లు తన పిటీషన్ లో ఆరోపించారు. క్రైస్తవ పవిత్ర గ్రంథం అయిన బైబిల్ పదాన్ని కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీ తో పోల్చడం సరికాదని అన్నారు. కరీనా కపూర్ తన పుస్తకానికి పాపులారిటీ అవ్వాలనే ఉద్దేశం తో బైబిల్ పదాన్ని వాడినట్లు ఆంథోని ఆరోపించారు.

#kareena-kapoor #kareena-kapoor-gets-notice
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe