Weird Traditions: దేవుడిగా మారిన డైనోసార్ల గుడ్లు.. అదే కులదైవం.. ఎక్కడంటే?

మధ్యప్రదేశ్‌-ధార్‌లోని గిరిజనుల దేవతగా పూజించే గోళాకార, రాతిలాంటి వస్తువు డైసనార్‌లోని టైటానో-కొంగ జాతికి చెందిన గుడ్డని అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ గుడ్లును వారు 'కాకర్ భైరవ్' అని పిలుస్తారు. 'కాకర్' అంటే పొలం అని అర్థం.'భైరవ' అంటే దేవుడు అని అర్థం.

Weird Traditions: దేవుడిగా మారిన డైనోసార్ల గుడ్లు.. అదే కులదైవం.. ఎక్కడంటే?
New Update

డైనోసార్లు(Dinosaurs).. 65 మిలియన్‌ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవులు. అయినా ఇప్పటికీ డైనోసార్ల గురించి ఏ చిన్న విషయం బయటపడినా ప్రజలు ఆసక్తిని చూపిస్తారు. డైనోసార్ల మీద వాటి గుడ్లు మీద చాలా సినిమాలు వచ్చాయి. సూపర్‌డూపర్‌ హిట్‌ కూడా అయ్యాయి. ఈ డైనోసార్లు అంతరించిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొనడంతో ఇవి అంతరించిపోయాయని చెబుతుంటారు. అడవి మంటలు, సునామీలు, సూర్యరశ్మిని అడ్డుకునే చెత్తతో కూడిన 'అణు శీతాకాలం' ప్రభావంతో సహా భారీ పర్యావరణ మార్పులకు గ్రహశకలం ఢీకొనడం కారణమైంది. ఇది పర్యావరణ వ్యవస్థలకు అంతరాయం కలిగించింది. దీంతో డైనోసార్‌లతో సహా అనేక జాతుల అంతరించడానికి దారితీసిందని చెబుతుంటారు. అయితే లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ డైనోసార్ల శిలాజలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. వాటి కోసం అన్వేషించే సైంటిస్టులు ఉంటారు. తాజాగా ఈ డైనోసార్ల శిలాజల(Fossils) గురించి ఓ న్యూస్‌ వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో డైనోసార్ల శిలాజల గుడ్లును పూజిస్తారని తెలిసింది.

డైనోసార్ల గుడ్లును పూజించే జాతులు:
భారత్‌దేశం.. భిన్న జాతుల సముహం..! దేశంలో ఉండే సంప్రదాయాలు అనేకం. ఈ ట్రెడీషన్స్‌ గ్రామగ్రామానికి మారుతాయి. ఊరు ఊరికి వేరుగా ఉంటాయి. ఇక దేవుళ్లను పూజించే పద్ధతిల్లోనూ అంతే. ఏ ఒక్క గ్రూప్‌తోనూ మరోకరిది మ్యాచ్‌ అవ్వదు. అటు గ్రామాల్లో ఆచారాలు కొన్నిసార్లు వింతగా అనిపిస్తాయి. మధ్యప్రదేశ్‌- ధార్‌లోని పడ్ల్య గ్రామంలో బైనోసార్ల శిలాజ గుడ్లును పూజించే సంప్రదాయం ఉంది. ఈ గుడ్లును వారు 'కాకర్ భైరవ్' అని పిలుస్తారు. 'కాకర్' అంటే భూమి లేదా పొలం అని అర్థం.'భైరవ' అంటే ప్రభువు లేదా దేవుడు అని అర్థం. ఈ కాకర్‌ భైరవ్‌ తమ వ్యవసాయ భూములను కాపాడుతాయని ఆ గ్రామ ప్రజల నమ్మకం. పశువుల సమస్యలను కూడా తీర్చేది ఈ దేవుడే అని వారి విశ్వాసం. దీపావళి రోజుల్లో గర్భం దాల్చిన ఆవులు, గేదెలకు ఈ గుడ్లుతో సహా పూజలు చేస్తుంటారు. ఈ గుడ్లు బంతి ఆకారంతో ఉంటాయి.

తవ్వకాల్లో దొరికాయి:
ధార్‌ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గ్రామస్తుల తవ్వకాల్లో ఈ గుడ్లు కనిపించాయని స్థానికులు చెబుతుంటారు. గ్రామంలో నివసించే 40 ఏళ్ల వేస్తా మండలోయ్ తవ్వుతుండగా గుండ్రని రాయిలాంటి వస్తువు దొరికింది. ఈ వస్తువు తమ పూర్వీకుల టోటెమ్ దేవత అని వారు విశ్వసించారు. తవ్వకాల్లో దొరికిన వస్తువును తమ తాళిబొట్టు కక్కడ్ భైరవుడని నమ్మి ఈ వస్తువును పూజించడం ప్రారంభించారు. ఆకారం పెద్ద బంతి సైజు ఉండడంతో దీన్ని పూజించడం మొదలుపెట్టారు గ్రామస్తులు. పడ్ల్యతో పాటు ఇతర గ్రామాల్లోనూ ఈ డైనోసార్ల శిలాజ గుడ్లును పూజిస్తారు. లక్నో'బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ నిపుణులు ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ విషయాన్ని కనుగొన్నారు. పడ్ల్య నివాసితులు పూజించే బంతులు డైనోసార్ల శిలాజ గుడ్లు ఆ ఊరి సందర్శనకు వెళ్లినప్పుడు అర్థమైంది. ఈ డైనోసార్ల శిలాజ గుడ్లు టైటానోసారస్ జాతులకు చెందినవి. గ్రామస్థులు గిరిజనుల దేవతగా పూజించే గోళాకార, రాతిలాంటి వస్తువు డైసనార్‌లోని టైటానో-కొంగ జాతికి చెందిన గుడ్డని అధ్యయనాలు స్పష్టం చేశాయి.

Also Read: ఆక్షన్‌కు ముందు ఏ టీమ్‌లో ఏ ఆటగాళ్లు ఉన్నారు? ఫుల్‌ లిస్ట్ ఇదే!

WATCH:

#dinosaur #weird-traditions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe