Pinnelli: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లొంగుబాటు?

పాల్వాయి గేట్ బూత్ లో ఈవీఎంలను పగులగొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు నరసరావుపేట కోర్టులో ఈ రోజు లొంగిపోయే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో పోలీసులు కోర్టు పరిసరాల్లో ఆంక్షలు విధించారు.

Pinnelli: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లొంగుబాటు?
New Update

Pinnelli Ramakrishna Reddy May Surrender: నరసరావుపేట కోర్టులో ఏ క్షణమైనా పిన్నెల్లి లొంగిపోయే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. కోర్టు దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇదంతా అనుమానమేనని.. అయితే, ఈ విషయంపై తమకు స్పష్టమైన సమాచారం లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు ఏపీ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే.. పిన్నెల్లి కోసం ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. 4 పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి.

#pinnelli-ramakrishna-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe