/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pinnelli-Rama-krishna-reddy-.jpg)
Pinnelli Ramakrishna Reddy May Surrender: నరసరావుపేట కోర్టులో ఏ క్షణమైనా పిన్నెల్లి లొంగిపోయే ఛాన్స్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. కోర్టు దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇదంతా అనుమానమేనని.. అయితే, ఈ విషయంపై తమకు స్పష్టమైన సమాచారం లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు ఏపీ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే.. పిన్నెల్లి కోసం ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. 4 పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి.