Maa Oori Polimera 2: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న పొలిమేర 2 ..!

'మా ఊరి పొలిమేర' సినిమా రిలీజైన మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. పార్ట్ 1 కన్నా పార్టీ 2 కి మరింత క్రేజ్ పెరిగింది. దానికి తగినట్లే సినిమా ఉండడం వల్ల వసూళ్ల పరంగా కూడా అదరగొట్టేస్తుంది.

New Update
Maa Oori Polimera 2: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న పొలిమేర 2 ..!

Maa Oori Polimera 2: 'మా ఊరి పొలిమేర' రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికైన 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ పొందడమే.. కాకుండా మంచి   విజయం సాధించింది. ఈ సినిమా పార్ట్ 1 ఊహించని విజయం సాధించడమే కాకుండా.. ప్రేక్షకుల్లో సీక్వెల్ పై ఆసక్తిని పెంచింది. 'మా ఊరి పొలిమేర' పార్ట్ 1 మంచి విజయం సాధించడంతో.. మేకర్స్ పార్ట్ 2 థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. రిలీజ్ కు ముందు సీక్వెల్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాదు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రేక్షకుల్లో మూవీ పై హైప్ క్రియేట్ చేశాయి.

publive-image

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో హర్రర్ సస్పెన్స్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలు పోషించారు. పొలిమేర పార్ట్ 2 సినిమా నవంబర్ 3 న థియేటర్స్ లో విడుదలైంది. హర్రర్ సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దానికి తోడు హర్రర్ థ్రిల్లర్ కు కావాల్సిన ఎలిమెంట్స్ తో మేకర్స్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంతో సినిమా ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యింది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్లు జోరుగా సాగుతున్నాయి.

publive-image

ఈ సినిమా వసూళ్లు మొదటి రోజు కన్నా రెండవ రోజు ఎక్కువగా ఉన్నాయి. రిలీజైన రెండు రోజుల్లోనే 6.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా ఈ ఫిగర్ మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పై మంచి టాక్ వినిపిస్తోంది. సినిమా టాక్ బాగా రావడంతో సినిమా చూసే ఆడియన్స్ సంఖ్య కూడా పెరుగుతుంది.

సినిమా రిలీజైన మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. పార్ట్ 1 కన్నా పార్టీ 2 కి మరింత క్రేజ్ పెరిగింది. దానికి తగినట్లే సినిమా ఉండడం వల్ల వసూళ్ల పరంగా కూడా అదరగొట్టేస్తుంది. ఈ సంవత్సరం ఇదే జానర్ లో వచ్చిన 'విరూపాక్ష' సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే దారిలో వచ్చిన  పొలిమేర 2 పై  కూడా సూపర్ హిట్ టాక్ వినిపిస్తోంది.

publive-image

Also Read: Prabhas Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. ‘సలార్’ విడుదల కానట్లేనా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు