సిమ్ కార్డులు కొంటున్నారా.. జాగ్రత్త! ఇతడికి ఏం జరిగిందో చూడండి..

గురుదాస్‌పూర్‌కు చెందిన అజయ్‌కుమార్‌ అనే వ్యక్తి కొరియర్‌ లో కంబోడియాకు 198 సిమ్ కార్డులను పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. సైబర్‌ రాకెట్ కోసం ఆ సిమ్ కార్డులను వినియోగించవచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల సిమ్ కార్డులపై కొత్త రూల్స్ వచ్చిన విషయం తెలిసిందే.

సిమ్ కార్డులు కొంటున్నారా.. జాగ్రత్త! ఇతడికి ఏం జరిగిందో చూడండి..
New Update

New Sim Card Rules: ఐడీ కార్డుంది కదా అని ఎన్నంటే అన్ని సిమ్ కార్డులు కొని పడేస్తే ఇక తిప్పలు తప్పవు. సిమ్‌కార్డుల కొనుగోలుకు సంబంధించి నిబంధనలు మారిన నేపథ్యంలో అప్రమత్తంగా లేకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే ప్రమాదముంది. బల్క్ గా సిమ్ కార్డుల కొనుగోలు విషయంలో రూల్స్ మరింత కఠినతరమయ్యాయి. లుథియానాలో ఒకేసారి 198 సిమ్‌కార్డులను పంపుతుండగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే.. మీ పాత ఫోన్‌ను ఈ 5 సైట్లలో అమ్మేయండి!

గురుదాస్‌పూర్‌కు చెందిన అజయ్‌కుమార్‌ అనే వ్యక్తి కొరియర్‌ ద్వారా కంబోడియాకు వాటిని పంపేందుకు ప్రయత్నిస్తుండగా.. సమాచారం తెలుసుకున్న పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. సైబర్‌ రాకెట్ కోసం ఆ కార్డులను వినియోగించవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, హాంకాంగ్‌లో ఓ కాల్‌ సెంటర్‌లో పని చేసేందుకు కొందరిని కలవగా, భారత్‌కు చెందిన సిమ్‌కార్డులను పంపమన్నారని అజయ్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: భారత్ – పాకిస్థాన్ మధ్య ఆమె ఉంది..! స్టూడెంట్ ఫన్నీ ఆన్సర్.. మరోసారి ట్రెండింగ్‎లో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ

కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం, ఎవరైనా ఒకే గుర్తింపుకార్డుపై తొమ్మిది కన్నా ఎక్కువ సిమ్‌కార్డులు పొందలేరు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. నేరం రుజువైతే మొదట రూ.50వేల వరకూ; ఆ తర్వాత రూ.2లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. వేరొకరి గుర్తింపు కార్డుపై సిమ్‌కార్డును కొని ఉపయోగిస్తే మూడేళ్ల వరకూ జైలుశిక్షతో పాటు రూ.50లక్షల వరకూ జరిమానా కూడా విధించవచ్చు. సిమ్ కార్డు లావాదేవీల విషయంలో బయోమెట్రిక్‌తో ఐడీ ధ్రువీకరణ కూడా ఇకనుంచి తప్పనిసరి.

#new-sim-card-rules
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe