Lung Cancer: స్మోక్ చేయకపోయిన లంగ్ క్యాన్సర్!

New Update
Lung Cancer: స్మోక్ చేయకపోయిన లంగ్ క్యాన్సర్!

.నాసెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే.. స్మోక్ చేసే వారి పక్కన ఉండి ఆ పొగను పీల్చడం. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా స్మోక్ చేస్తుంటే.. ఆ పొగ మనకు తెలియకుండానే గాలి ద్వారా మన ముక్కులోకి వెళ్తుంది. దాంతో.. మనం పొగ తాగకపోయినా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

2019లో "Journal of the National Cancer Institute" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కి గురైన పొగతాగని పురుషులలో లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 21% పెరిగిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ లియాంగ్ జౌ పాల్గొన్నారు. నాన్ స్మోకర్స్..​ ధూమపానం చేసే వారితో కలిసి ఉండటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

నగరాలలో పెరిగిన వాహనాల వాడకం, పారిశ్రామిక కార్యకలాపాలు, ఇతర వివిధ కాలుష్య కారకాల నుంచి వెలువడే సూక్ష్మ రేణువులను ఎక్కువకాలం పీల్చడం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఎప్పుడూ స్మోక్ చేయనివారిలో రాడాన్ ఎక్స్​పోజర్ కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరగడానికి ప్రధాన ప్రమాద కారకంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. రాడాన్ అనేది నేల, రాళ్లలో ఉన్న యురేనియం క్షయం నుంచి వెలువడే రేడియోధార్మిక వాయువు. ఇది కనిపించదు. వాసన కూడా ఉండదు. దీన్ని మానవ క్యాన్సర్ కారకంగా.. 1988లో "ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్" (IARC) గుర్తించింది.

ఇటీవల జరిపిన కొన్ని అధ్యయనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వారసత్వంగా వచ్చే అవకాశం ఉందని కనుగొన్నాయి. ధూమపానం చేయనివారిలో లంగ్ క్యాన్సర్లు దాదాపు 5-10% వంశపారంపర్యంగా లేదా జన్యులోపాల వల్ల వస్తున్నాయని తేలిందట.ధూమపానం చేయనివారిలో లంగ్ క్యాన్సర్ అభివృద్ధికి మరో ముఖ్యమైన ప్రమాద కారకం.. ఊపిరితిత్తుల వ్యాధులు. అంటే.. నాన్​ స్మోకర్స్​లో ఇప్పటికే ఏమైనా ఊపిరితిత్తుల సమస్యలు ఉండే అవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ధూమపానం చేయనివారిలో వంట చేయడానికి కలపను కాల్చడం వల్ల అందులో నుంచి నిరంతరం వెలువడే ఉద్గారాలు లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు