LPG Biometric Update: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 31వ తేదీ లోపు గ్యాస్ కనెక్షన్స్ ఉన్న వారు కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. గ్యాస్ సబ్సిడీ కట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే.. జనాలు తమ బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకునేందుకు గ్యాస్ ఏజెన్సీ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. అవును, తెలంగాణ వ్యాప్తంగా వంట గ్యాస్ కనెక్షన్స్ కేంద్రాల వద్ద ప్రజలు భారీ ఎత్తున బారులు తీరారు. దాంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద హడావుడి నెలకొంది. దీపం, ఉజ్వల, సీఎస్‌ఆర్ పథకాలతోపాటు సాధారణ గ్యాస్ కనెక్షన్‌లు కలిగిన వారు తమ తమ ఏజెన్సీలో బయోమెట్రిక్ నమోదు/కేవైసీని (KYC) పూర్తి చేయాలని చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఎవరి పేరున గ్యాస్ కనెక్షన్ ఉందో.. వారు తమ ఆధార్ కార్డును తీసుకెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయాలి. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే.. సబ్సిడీ అందదు.
అయితే, కేవైసీ ప్రక్రియను పూర్తి ఉచితంగా చేస్తారు. గ్యాస్ కనక్షన్ ఉన్న వ్యక్తి చనిపోయినట్లయితే.. వారి కుటుంబంలో మరొకరి పేరు మీదకు కనెక్షన్ మార్చుకోవచ్చు. ఇందుకోసం.. గ్యాస్ కనెక్షన్ డాక్యూమెంట్స్, గ్యాస్ బుక్ సమర్పించాలి. అలాగే, ఎవరి పేరున మార్చాలనుకుంటున్నారో.. వారి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, డిపెండెంట్ డాక్యూమెంట్స్‌ని సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కీలక కారణం ఉందని చెబుతున్నారు అధికారులు. చాలా మంది ప్రజలు.. ఒకరి పేరు మీద అనేక గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. ఇప్పుడు కేవైసీ పూర్తి చేస్తే.. ఎవరి పేరు మీద ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనేది తేలనుంది.
ఇందులో వాస్తవం లేదు..
తెలంగాణ ప్రభుత్వం రూ. 500 లకే గ్యాస్ ఇస్తోందని, ఆ కారణంగానే గ్యాస్ ఏజెన్సీల వద్ద బయోమెట్రిక్ కోసం జనాలు బారులు తీరాని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఈకేవైసీ చేపడుతున్నారు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిథులు. ఈ బయోమెట్రిక్‌తో రాష్ట్ర ప్రభుత్వ పథకానికి ఏమాత్రం సంబంధం లేదని చెబుతున్నారు.
Also Read:
ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి లోపు రెగ్యులరైజ్..