🔴LIVE UPDATES: లోక్ సభ స్పీకర్ ఎన్నిక లైవ్ అప్డేట్స్

దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీయే నుంచి ఓం బిర్లా మరోసారి స్పీకర్ కూర్చి కోసం పోటీ పడుతున్నారు. అలాగే ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ పోటీకి దిగారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

🔴LIVE UPDATES: లోక్ సభ స్పీకర్ ఎన్నిక లైవ్ అప్డేట్స్
New Update

దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీయే నుంచి ఓం బిర్లా మరోసారి స్పీకర్ కూర్చి కోసం పోటీ పడుతున్నారు. అలాగే ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ పోటీకి దిగారు. కాగా తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇండి కూటమిని ఎన్డీయే కోరగా.. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తేనే మద్దతు తెలుపుతామని అని ఇండి కూటమి డిమాండ్ చేసింది. దీనికి ఎన్డీయే ఒప్పుకోక పోవడంతో ఇండి కూటమి స్పీకర్ పదవి పోటీకి అభ్యర్థిని బరిలోకి దింపింది.

  • Jun 26, 2024 11:50 IST
    ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ మాట్లాడుతూ “రెండోసారి ఎన్నికైన మీరు విజయవంతం అయినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.

  • Jun 26, 2024 11:41 IST
    లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు

  • Jun 26, 2024 11:36 IST
    మీరు రెండోసారి స్పీకర్ గా గెలిచి చరిత్ర సృష్టించారు: ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు

  • Jun 26, 2024 11:30 IST
    18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు.

  • Jun 26, 2024 11:15 IST
    18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా

  • Jun 26, 2024 11:14 IST
    వైసీపీ మద్దతుతో 297కు చేరిన ఎన్డీయే బలం

  • Jun 26, 2024 11:12 IST
    మోదీ ప్రతిపాదనను బలపరిచిన బీజేపీ ఎంపీలు, మిత్రపక్షాలు

  • Jun 26, 2024 11:11 IST
    ఎంపీలకు స్లిప్పులు పంపిణీ

  • Jun 26, 2024 11:11 IST
    లోక్ సభ సబ్యులకు స్లిప్ ల పంపిణి

  • Jun 26, 2024 11:11 IST
    స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం

  • Jun 26, 2024 11:09 IST
    లోక్ సభ స్పీకర్ గా ఓమ్ బిర్లా

  • Jun 26, 2024 11:02 IST
    పార్లమెంట్ సమావేశం ప్రారంభం.. కాసేపట్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక

  • Jun 26, 2024 10:57 IST
    లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై, బీజేపీ ఎంపి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. "సాధారణంగా స్పీకర్‌కు పోటీ ఉండదు, కానీ ఈసారి ప్రతిపక్షం అన్ని సంప్రదాయాలను ఉల్లంఘిస్తోంది. స్పీకర్ పార్టీలకతీతంగా ఉంటారు, కానీ వారు స్పీకర్ పదవిని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం." అని అన్నారు.

  • Jun 26, 2024 10:55 IST
    లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. "ఎలాంటి చర్చలు జరగలేదు. ఎన్నికలు జరగబోతున్నాయి, అందుకే మా అభ్యర్థిని ప్రతిపాదించాము" అని అన్నారు

  • Jun 26, 2024 10:54 IST
    ఎన్నికలు జరుగుతాయి, ఫలితాల కోసం వేచి చూడాలి: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

  • Jun 26, 2024 10:53 IST
    కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు చేరుకున్నారు.

  • Jun 26, 2024 10:52 IST
    పార్లమెంట్ కు చేరుకున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

#lok-sabha-speaker
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe