First Phase Polling : లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) లకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్వత్రా ఉత్కంఠ పెరిగింది. ఎన్నికల ప్రచారానికి(Election Campaign) అన్ని పార్టీలు తమ శక్తియుక్తులను ముమ్మరం చేశాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుంది. రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాల్గవ దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ 1న నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఏయే రాష్ట్రాల్లో ఓటింగ్ జరుగుతుంది?
తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కింలలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇది కాకుండా, మొదటి దశలో మేఘాలయలోని షిల్లాంగ్, తురా స్థానాలకు కూడా ఓటింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న మణిపూర్‌లోని 2 స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.
బీహార్‌లోని 4 స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లోని 6 స్థానాలకు ఓటింగ్, మహారాష్ట్రలోని రామ్‌టెక్ నాగ్‌పూర్ స్థానాలు జరుగుతాయి. రాజస్థాన్‌లో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో ఓటింగ్ జరగనుంది. తమిళనాడులోని 39 స్థానాలకు తొలి దశలో ఓటింగ్ జరగనుంది.అస్సాంలోని దిబ్రూఘర్, సోనిత్‌పూర్, చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, బీహార్‌లోని జమూయి, గయా, జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ సీటు, మధ్యప్రదేశ్‌లోని చింద్వారా, తమిళనాడుకు చెన్నై ఉత్తరం, చెన్నై సౌత్, చెన్నై సెంట్రల్, కోయంబత్తూర్, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి, మణిపూర్ రెండు రాజస్థాన్‌లోని బికనీర్, పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్, అలీపుర్‌దూర్ సీట్లపైనే అందరి దృష్టి ఉంటుంది.
మొదటి దశలో ముఖ్యమైన అభ్యర్థులు:
జముయి స్థానం నుండి చిరాగ్ పాశ్వాన్, చింద్వారా నుండి నకుల్నాథ్, కోయంబత్తూరు నుండి కె అన్నామలై, చెన్నై సౌత్ నుండి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan), తూత్తుకుడి నుండి కనిమొళి కరుణానిధి, పిలిభిత్ నుండి జితిన్ ప్రసాద్, కూచ్ బెహార్ నుండి నిసిత్ ప్రమాణిక్ పోరులో దిగారు.
దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే మొదటి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో మొత్తం 120 లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈసీ అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర బలగాలు మోహరించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: సజ్జలతో పాటు ఇతర సలహాదారులు ఈసీ ఊహించని షాక్.. అలా చేస్తే వేటే!