Mahbubnagar: దొంగ నా కొ..కులే పరీక్షలను అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్

రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. అలాగే దొంగనా కొడుకులే గ్రూప్2, డీఎస్సీ పరీక్షలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 

Mahbubnagar: దొంగ నా కొ..కులే పరీక్షలను అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్
New Update

CM Revanth Reddy: రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. కార్యకర్తలను సర్పంచ్, ఎంపీటీసీలుగా గెలిపించుకునేందుకు నేతలంతా కష్టపడాలన్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో పార్టీకోసం కష్టపడిన వారినే కూర్చోబెట్టాలని ఆదేశించారు.

పేద పిల్లల జీవితాలు ఆగం చేస్తున్నారు..
అలాగే కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కుట్రలు పన్నుతున్నాయన్నారు. పదే పదే పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు. దీక్షలు చేపించి పేద పిల్లల జీవితాలు ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. పేద పిల్లల అండతోనే హరీష్ రావు, కేటీఆర్ గెలిచారన్నారు. కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) దీక్షకు కూర్చోవాలన్నారు. విద్యార్థుల చావులతో రాజకీయం చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల్ని రెచ్చిగొట్టి లబ్ది పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు..
ఇక కాంగ్రెస్ లోకి చేరికలపై మాట్లాడుతూ.. కేసీఆర్ తమ నాయకులను కూడా అసెంబ్లీ గేటు దగ్గర గుంజుకపోయారని, అది మరిచిపోయావా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగిలిందన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చూడలేకపోతే ఫామ్ హౌస్ లో పండుకోవాలని సూచించారు. కేటీఆర్, హరీష్ రావు మోడీ చుట్టు పిల్లిలా తిరుగుతున్నారన్నారు. అలాగే నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 30వేల ఉద్యోగాలిచ్చామని, ప్రభుత్వ ఉద్యోగులకు 1తారీఖు జీతాలిస్తున్నామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ పరీక్షను పోస్ట్ ఫోన్ చేయమంటున్నారు. క్యాలెండర్ డేట్ ప్రకారం పరీక్షలు పెడుతున్నామని చెప్పారు.

#cm-revanth-reddy #latest-news-in-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe