ఆయుర్వేదం ప్రకారం పసుపు ఆరోగ్యానికి ఒక వరం. పసుపు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీబయాటిక్, యాంటీ సెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందుకని కొంతమంది రోజూ తాగే పాలలో పసుపు కలిపి తాగుతుంటారు. అయితే పసుపు పాలు అందరికీ మంచిది కాదు. ఎవరు తాగకుడదో ఇక్కడ చదవండి
అలర్జీస్
కొంతమందికి పసుపు పాలు తాగిన తర్వాత అలర్జీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పసుపు పాలు తగిన వెంటనే శరీరంలో దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తే, పసుపు పాలు తాగే ముందు నిపుణుల సలహా తీసుకోండి.
పిత్తాశయ సమస్యలు
పిత్తాశయం సంబంధిత సమస్యలు ఉన్నవారు పసుపు పాలకు దూరంగా ఉండడం మంచిది. పసుపు బైల్ ఉత్పత్తిని ప్రేరేపితం చేస్తుంది. దీని ద్వారా గాల్ బ్లాడర్ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కావున పిత్తాశయ సంబంధిత సమస్యలు ఉన్నవారు పసుపు పాలు అస్సలు తాగవద్దు.
రక్తహీనత
రక్తహీనతతో బాధపడేవారు పసుపు పాలను తాగవద్దు. పసుపు పాలు రోజూ తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఎందుకంటే పసుపు పాలలోని ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఇవ్ కాకుండా సాధారణ పాలు తాగడం మంచిది.
లో షుగర్ లెవెల్స్
శరీరంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు పసుపు పాలను నివారించాలి. పసుపులో 'కర్కుమిన్' అనే కంపౌండ్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.