Sitting on Toilet: నిద్రలేచామా.. మొబైల్ పట్టుకున్నామా.. బాత్రూమ్ లోకి వెళ్లి కమోడ్ పై గంటలు గంటలు కూర్చుని ఫోన్ చూస్తూ ఉన్నామా.. అన్నట్లుగా ఉంటుంది ఉదయానే కొందరి వ్యవహారం. ఫోన్ లో మునిగిపోయి టైం తెలియకుండా రెండు, మూడు గంటలు బాత్రూంలోనే ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే దిక్కుమాలిన అలవాటు ఆరోగ్యానికే పెద్ద ముప్పని మీకు తెలుసా..?
Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!
10 నిమిషాలకు మించి టాయిలెట్ పై కూర్చుంటే..
10 నిమిషాలకు మించి టాయిలెట్ పై కూర్చుంటే ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. టాయిలెట్ పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మొలల వ్యాధి ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే కంటి కండరాళ్ళు బలహీనపడతాయని టెక్సాస్ యూనివర్సిటీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. న్యూయార్క్‌లోని స్టోని బ్రూక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరా మన్జూర్ 5-10 నిమిషాల కంటే ఎక్కువ సమయం కమోడ్ పై ఉండకూడదని సూచించారు. దీని వల్ల రక్తప్రసరణను ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పురీషనాళం చుట్టూ ఉండే సిరలు, రక్తనాళాలు పెద్దవిగా మారి మొలలకు దారితీస్తాయి.
మొలలు అంటే ఏంటి..?
ఆహారంలో ఫైబర్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోవడం, నీరు తక్కువ తాగడం వంటి సమస్యలు పైల్స్‌కు(మొలలు) కారణమవుతాయి. పైల్స్ ఉన్నవారిలో మలద్వారం లోపల, వెలుపల, పురీషనాళం దిగువ భాగంలో సిరల్లో వాపు, మంట, చికాకు కలుగుతుంది. రక్తస్రావం కూడా ఉంటుంది. మలబద్ధకం, ప్రెగ్నెన్సీ, ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, ఆహారంలో పీచు లోపం, తక్కువ నీరు తాగడం వంటి సమస్యలు ఉన్నవారు పైల్స్‌తో ఎక్కువ బాధపడే అవకాశం ఉంటుంది. పైల్స్‌ను హెమోరాయిడ్స్ అని కూడా అంటారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ