భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు రావడం సహజమే. కానీ భర్తలు కోపంలోనో, తమాషాగానో చెప్పే మాటలు భార్య ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడకూడదు. ఇలాంటివి భార్య, భర్తల మధ్య పెద్ద వివాదాలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇవి బంధాన్ని విచ్చినం కూడా చేస్తాయి. ముఖ్యంగా మూడు విషయాలు గురించి మాత్రం భార్యతో అస్సలు మాట్లాడకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇతరులతో పోలుస్తూ హేళన చేయడం
పొరపాటున కూడా మీ భార్యను ఇతర అమ్మాయిలతో లేదా మీ కుటుంబంలోని వ్యక్తులతో పోలుస్తూ అవమానించకూడదు. ఈ ప్రతికూల పోలిక భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. ఇది భార్య మనసును బలంగా గాయపరుస్తుంది. దీని వల్ల సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
లుక్స్ గురించి జోక్స్ వేయడం
భర్తలు భార్య శారీరక రూపం గురించి ఎప్పుడూ జోకులు వేయకూడదు. ఇది వారికి చాలా ఇబ్బందికరంగా, హేళనగా ఉంటుంది. భార్య లావుగా, సన్నగా ఉందని లేదా ఆమె పొట్టిగా ఉందని బాడీ షేమింగ్ చేయకూడదు. ఇది వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉంటుంది. దీని వల్ల వారు ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతారు.
తల్లితో పోల్చడం
దాదాపు భర్తలు తెలిసి లేదా తెలియక తన భార్యను తన తల్లితో పోలుస్తుంటారు. లా పదే పదే పోల్చడం వల్ల మీ భార్య చికాకు, ఇబ్బంది, కోపంతో కలుగుతుంది. మీ తల్లి వ్యక్తిత్వం, పరిస్థితులు, అలవాట్లు.. మీ భార్య వ్యక్తిత్వం, పరిస్థితులు, అలవాట్లు భిన్నంగా పూర్తి భిన్నంగా ఉంటాయి. కావున ఇద్దరు వేర్వేరు వ్యక్తులను ఒకేవిధంగా పోల్చడం ఏ భార్య కూడా ఇష్టపడడు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.