సాధారణంగా బొప్పాయిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. డైలీ డైట్ లో ఈ పండును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. అయితే బొప్పాయి పండు మాత్రమే కాదు దీని గింజలతో కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
అధిక బరువు
అధిక బరువు ఉన్నవారికి బొప్పాయి గింజలు బాగా సహాయపడతాయి. వీటిలోని అధిక ఫైబర్ కంటెంట్.. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉండనే భావనను కలిగించి.. బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.
పేగు ఆరోగ్యం
బొప్పాయి గింజల్లోని కార్పెన్ అనే ఆల్కలాయిడ్ పేగులోని అనారోగ్యమైన బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. అలాగే వీటిలోని పాపైన్, చైమోపాపైన్ వంటి ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
నెలసరి నొప్పి
బొప్పాయి పండు గింజలు పీరియడ్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలోని కెరోటిన్ ఈస్ట్రోజెన్ హార్మోన్ ను నియంత్రణలో ఉంచి.. పీరియడ్ నొప్పిని తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్
బొప్పాయి గింజలు తీసుకోవడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ గింజల్లోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది . అలాగే వీటిలోని ఒలీక్ ఆమ్లం, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
బొప్పాయి గింజలను ఎలా తీసుకోవాలి
బొప్పాయి గింజలను స్మూతీస్ రూపంలో తినవచ్చు. ఇలా చేయడం ద్వారా శరీరానికి పోషకాలు అందుతాయి.
సలాడ్
బొప్పాయి గింజలను సలాడ్‌లో రూపంలో కూడా తీసుకోవచ్చు. బొప్పాయి గింజలను గ్రైండ్ చేసి సలాడ్‌లో కలుపుకుంటే స్పైసీ, కరకరలాడే రుచి వస్తుంది.