వేద పంచాంగం ప్రకారం అష్టమి తిథి అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12:31 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 11వ తేదీ మధ్యాహ్నం 12:06 గంటలకు ముగుస్తుంది. నవమి తిథి అక్టోబర్ 11వ తేదీ మధ్యాహ్నం 12:06 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10:57 గంటలకు ముగుస్తుంది. అంటే అష్టమి, నవమి రెండు తిథులు ఒకేరోజు కలుస్తున్నాయి.
అయితే నవరాత్రుల్లో గొప్ప ప్రాముఖ్యత కలిగిన అష్టమి, నవమి తిథి రోజున కొన్ని ప్రత్యేక వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే దేవి మాత అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వెండి నాణెం
నవరాత్రుల్లో ఇంటికి వెండి నాణేలు తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా అష్టమి, నవమి రోజుల్లో వీటిని ఇంటికి తీసుకొస్తే విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. అయితే లక్ష్మీ దేవి బొమ్మ ఉన్న నాణెం తీసుకొచ్చి దేవి పాదాలు దగ్గర ఉంచండి. దీని వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం.
ఇత్తడి కలశం
నవరాత్రుల్లో అష్టమి, నవమి తిథుల్లో ఇత్తడి కలశాన్ని కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో దీనిని ఇంటికి తీసుకురావడం వల్ల గృహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
నెమలి ఈకలు
విశ్వాసాల ప్రకారం అష్టమి, నవమి తిథి రోజున నెమలి ఈకను కొనుగోలు చేయడం వల్ల తీసుకురావడం ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదని నమ్ముతారు. అంతేకాదు నెమలి ఈకలను గుడిలో పెట్టడం వల్ల తల్లి లక్ష్మి, దుర్గా మాత సంతోషిస్తారు.
దేవీ మాతకు వస్త్రాలంకరణ
దేవీ మాతకు వస్త్రాలంకరణ.. ఎరుపు బిందీ, బ్యాంగిల్స్, చీర సమర్పించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల స్త్రీలు అఖండ సౌభాగ్యంతో ఆశీర్వదించబడతారని చెబుతారు.
రక్షా సూత్రం
రక్షసూత్రానికి హిందూ మతంలో చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రుల్లో అష్టమి, నవమి తిథుల్లో ఈ రక్ష సూత్రాన్ని కొనుగోలు చేసినా.. చేతికి కట్టుకున్నా దుర్గా మాత ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారని విశ్వాసం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.