/rtv/media/media_files/2025/05/11/75wsh9HBjsL0fVRqTap3.jpg)
mothers day special recipes
Mother's Day Special: దేవుడు అన్ని చోట్ల చేరుకోలేడు.. అందుకే అమ్మను సృష్టించాడని అంటారు. తల్లి తన బిడ్డపై చూపించే నిస్వార్థమైన ప్రేమ, త్యాగాలకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది మే రెండవ ఆదివారం రోజున మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు . ఈ ప్రత్యేకమైన రోజున పిల్లలు బహుమతులు లేదా సర్ప్రైజ్ ల ద్వారా తల్లులకు తమ ప్రేమను తెలియజేస్తారు. మీరు కూడా మీ అమ్మను ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే మీ అమ్మను సైర్ప్రైజ్ చేయాలనుకుంటే ఈ ఐడియాను ఫాలో అవ్వండి. ప్రతి అమ్మ తన కూతురు చేయితో చేసిన వంటకాన్ని టెస్ట్ చేయాలని ఎప్పుడూ కోరుకుంటుంది. కావున ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీలతో అమ్మను సర్ప్రైజ్ చేయండి.
మదర్స్ డే స్పెషల్
- ఫ్రూట్ ప్యాంకేక్స్
గోధుమ పిండి, బెనానా మాష్ చేసి ప్యాంకేక్‌లా వేయించండి. పైన తేనె, చిన్న చిన్న ఫ్రూట్ పీసులు వేసి అలంకరించండి. ఇది హెల్తీ, టేస్టీ, అలాగే తక్కువ సమయమే పడుతుంది.
- అమ్మ స్పెషల్ పులిహోర
అన్నంలో.. కొంచెం తురిమిన క్యారెట్, పచ్చి మిర్చి ముక్కలు, చింతపండు రసం, పసుపుతో కలిపిన పోపు వేస్తే పులిహోర రెడీ. అమ్మ స్పెషల్ గా చెప్పే ఈ పులిహోరను.. ఈసారి పిల్లలే చేస్తే అమ్మ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది.
- ఖర్జూరం లడ్డూ
ఇంట్లో ఎల్లప్పుడు కష్టపడుతూ అమ్మలు నీరసించిపోతారు. కావున వారి హెల్త్ కోసం హెల్తీగా ఖర్జూర లడ్డూ చేయడం ద్వారా అమ్మలు సంతోషిస్తారు. ఖర్జూరం, బాదం, కాజూ, డ్రై కొబ్బరి అన్నింటినీ నెయ్యిలో ఫ్రై చేసి.. ఆ తర్వాత గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని లడ్డూలు చేయండి.
- అమ్మ ఫేవరెట్ టీ
అమ్మకు ఇష్టమైన ఫేవరెట్ టీని మీరు స్పెషల్ గా చేసి ఇవ్వడం ద్వారా అమ్మ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. అంతేకాదు ఈరోజు వంటగది నుంచి అమ్మకు రెస్ట్ ఇవ్వండి.
- కేక్
ఇంట్లోనే సింపుల్ గా అమ్మ కోసం కేక్ తయారు చేయండి. బోర్బన్ లేదా మారి బిస్కెట్లు, కాకో పౌడర్, పాలు కలిపి లేయర్స్‌గా సెట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టండి.
అవసరమైన పదార్థాలు:
6 స్లైసుల బ్రెడ్, 1/2 కప్ చక్కెర, 1/4 కప్ పాలు, 1/4 కప్ వెన్న (వేడి చేసినది), 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ వెనిల్లా ఎస్సెన్స్ (ఐచ్ఛికం), చిటికెడు ఉప్పు
తయారీ విధానం:
బ్రెడ్ స్లైసులను చిన్న ముక్కలుగా రిప్ చేసి, వాటిని ఒక బౌల్‌లో ఉంచుకోండి. మరో బౌల్‌లో పాలు, వెన్న, చక్కెర వేసి బాగా కలపండి.
ఇప్పుడు పాలు, వెన్న మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కల్లో పోసి బాగా కలిపండి. ఆ తర్వాత మళ్ళీ కాస్త బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపండి.
పాన్‌లో పెట్టి బేక్ చేయండి
ఒక బేకింగ్ పాన్‌ను వెన్నతో గ్రీస్ చేసి, మిశ్రమాన్ని దానిలో పోసి, 180°C వద్ద 20-25 నిమిషాలు బేక్ చేయండి. కేక్ పైన సువాసన వస్తే, అది తయారవుతుంది.
చల్లార్చి సర్వ్ చేయండి
కేక్ చల్లారిన తర్వాత, స్లైసులు కట్ చేసి అందించండి!