రోజు చేసే ఈ తప్పులు.. జీవితంలో అనేక అనర్థాలకు కారణం! హిందూ మత విశ్వాసాల ప్రకారం.. జీవితంలో శాంతి, శ్రేయస్సు కోసం వాస్తు నియమాలను అనుసరించడం చాలా ముఖ్యమైనది. అయితే ప్రతిరోజు తెలిసి తెలియక చేసే తప్పులు ఇంట్లో, జీవితంలో ప్రతికూలతను పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 08 Dec 2024 in లైఫ్ స్టైల్ Short News New Update షేర్ చేయండి 1/8 తలను, గోళ్ళను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. గోళ్లలో పేరుకుపోయిన మురికి వ్యక్తి జీవితం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. 2/8 బూట్లు, చెప్పులను ఇంటి ప్రధాన ద్వారా వద్ద ఎప్పుడూ ఉంచకూడదు. చెప్పులను దక్షిణం లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. ఇంటి ముందు చెప్పులను వదలడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. 3/8 ఇంట్లో సానుకూలతను పెంచడానికి తగినంత లైటింగ్, పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంటిని చీకటిగా ఉంచడం నెగిటివిటీని పెంచుతుంది. 4/8 ఎండిపోయిన చెట్లు, మొక్కలను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు. దీని వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. 5/8 ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని అస్సలు ఉంచకూడదు. ఇది జీవితంలో కూడా ఆగిపోవడాన్ని సూచిస్తుంది. పాడైన గడియారాన్ని వెంటనే బయట పారేయండి. 6/8 వాస్తు శాస్త్రాల ప్రకారం.. ఇంట్లో పాత వార్తాపత్రికలను ఎక్కువ కాలం పాటు ఉంచడం ద్వారా.. ప్రతికూలను వ్యాప్తి చేస్తుంది. 7/8 వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. ఒకే బట్టలను సంవత్సరాల పాటు ధరించకూడదు. ఇలా చేయడం చెడు ఫలితాలను ఇవ్వవచ్చు. అప్పుడప్పుడు బట్టలను మారుస్తూ ఉండడం మంచిదని సూచిస్తున్నారు. 8/8 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి