నేటి కాలంలో పురుషులు అందంగా, స్టైలిష్ గా కనిపించడానికి రకరకాల బియర్డ్స్ ను ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అలాగే క్లీన్ షేవ్ ఉంచుకునే వ్యక్తులు కూడా ఉంటారు. తాము చేసే ఉద్యోగం, వారి శరీర ఆకృతికి అనుగుణంగా గడ్డాన్ని మార్చుకుంటుంటారు.
అయితే కొంతమందికి ప్రతీరోజు ఉదయం నిద్రలేవగానే క్లీన్ షేవ్ చేసుకోవడం అలవాటు. మరికొంతమంది నెలల తరబడి గడ్డం తీయకుండా ఉంటారు. అసలు ప్రతిరోజు షేవ్ చేయడం మంచిదేనా? లేదా హానికరమా..? అలాగే నెలల తరబడి గడ్డం తీయకుండా ఉంటే ఏమవుతుంది? అనే వాటిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
రోజూ కంటే వారానికి ఒకసారి షేవింగ్ చేసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే దీని వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలాగే రోజూ షేవింగ్ చేయడం వల్ల కూడా ఎటువంటి హానీ ఉండదని చెబుతున్నారు. కాకపోతే సరైన ట్రిమ్మర్ లేదా రేజర్ ఉపయోగించడం మంచిది.
అంతేకాదు నిపుణుల అభిప్రాయం ప్రకారం గడ్డం ఉంచుకోవడం వల్ల చర్మానికి ఎటువంటి హాని జరగదని చెబుతున్నారు. అయితే గడ్డం పెద్దగా ఉన్నవారు ప్రతి రోజు శుభ్రంగా కడుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. రోజు బయట తిరిగినప్పుడు మొహం పై క్రిములు, దుమ్ము పేరుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రతి రోజూ గడ్డాన్ని శుభ్రం చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దుమ్ము వల్ల చర్మ రంద్రాలు మూసుకుపోయి చికాకును కలిగిస్తుంది.
కొంతమందికి షేవింగ్ చేసుకున్న తర్వాత మంటగా అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు చర్మ వ్యాధి నిపుణులు సంప్రదించడం మంచిది. సరైన క్రీమ్ లేదా జెల్ ఎంచుకోవడం ద్వారా చర్మంపై ప్రతికూల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.