అయితే ఇవి మనిషి అభివృద్ధికి అవసరమే అయినప్పటికీ.. అతి వినియోగం అత్యంత హానికరమైనది.
అధ్యయనాల ప్రకారం.. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల కళ్ళ పై తీవ్ర ప్రభావం చూపుతుందట. అంతే కాదు దీని ద్వారా హానికరమైన వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు నిపుణులు.
ఈ వ్యాధిని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని పిలుస్తారు. ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాల పై ఎక్కువగా ఉండడం కళ్ళు, కండరాళ్ళ పై విపరీతమైన ప్రభావం చూపుతుంది. ఇది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడడానికి కారణమవుతుంది.
ప్రస్తుతం కంప్యూటర్లు, డిజిటల్ స్క్రీన్లు ప్రతీ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజూ 2 గంటల కంటే ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్స్ పై గడిపే ప్రతీ వ్యక్తి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఉంది.
ఈ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువును చూడండి.
ఇలా చేయడం కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. అలాగే స్క్రీన్ చూస్తూ పని చేస్తున్నప్పుడు రెప్ప వేస్తూ ఉండాలి. అదే పనిగా చూడడం మంచిది కాదు. ఇది కళ్ళు పొడిబారకుండా కాపాడుతుంది.
కంప్యూటర్స్ ముందు వర్క్ చేసేటప్పుడు తగినంత లైటింగ్ ఉండేలా చూసుకోండి. అలాగే వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ ను తగ్గించడానికి యాంటీ గ్లేర్ గ్లాసెస్, లేదా స్క్రీన్ పై బ్లూ లైట్ ఫిల్టర్ ను వాడండి.
ప్రతి గంటకు 5-10 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోవడం మంచిది. అదే పని కూర్చోవడం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది.