Milk: సాధారణంగా పాలలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలకు చాలా మేలు చేస్తాయి. పలు పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అయితే వింటర్ సీజన్ లో పాలు తాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. వాతావరణంలోని మార్పుల కారణంగా వింటర్ సీజన్ లో వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కావున వింటర్ సీజన్ లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఐదు పదార్థాలను కలిపి తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
బాదం
బాదం పప్పును పాలలో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బాదంపప్పులో ప్రొటీన్, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. తద్వారా పాలు, బాదంపప్పు కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పసుపు
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. చలికాలంలో పసుపు పాలు తాగడం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
ఖర్జూరం
ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా చలికాలంలో ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థకు పవర్ హౌస్ గా పనిచేస్తాయి. పాలతో వీటిని కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనంలో కూడా సహాయపడతాయి.
జాజికాయ
రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీరు పాలలో జాజికాయ పొడిని కలపవచ్చు. ఇది జీర్ణశక్తి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి.
బెల్లం
బెల్లం చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం చెబుతారు. చలికాలంలో దీనిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బెల్లాన్ని పాలతో కలిపి తాగడం వల్ల మీ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అంతేకాదు శక్తిని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.