/rtv/media/media_files/2024/12/07/hairfall41.jpeg)
శరీరానికి సరైన పోషకాలు, సప్లిమెంట్స్ అందకపోవడమే, అనారోగ్యమైన అలవాట్ల కారణంగా జుట్టు రాలడం మొదలవుతుంది. ముఖ్యంగా అబ్బాయిల్లో జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఈ సప్లిమెంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇపుడు తెలుసుకోండి..
/rtv/media/media_files/2024/12/07/hairfall101.jpeg)
విటమిన్ ఈ
విటమిన్ ఈ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది జుట్టు కుదుళ్లను బలంగా తయారు.. చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఆకుకూరలు, ఆల్మండ్స్, గుమ్మడికాయ వంటి పదార్థాల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.
/rtv/media/media_files/2024/12/07/hairfall11.jpeg)
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
ఆహారంలో ఒమేగా 3 యాసిడ్స్ తీసుకోవడం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
/rtv/media/media_files/2024/12/07/hairfall31.jpeg)
బయోటిన్
బయోటిన్ జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ ని బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు కుదుళ్లకు మంచి పోషణను అందిస్తుంది. మీట్, మష్రూమ్, అవకాడో, స్వీట్ పొటాటో లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది.
/rtv/media/media_files/2024/12/07/hairfall71.jpeg)
జింక్
జుట్టు రాలే సమస్య ఉన్నవారు జింక్ పుష్కలంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. జింక్ ప్రోటీన్ గ్రహించి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.
/rtv/media/media_files/2024/12/07/hairfall91.jpeg)
సెలీనియం
సెలీనియం హెయిర్ ఫోలికల్స్‌ను బలోపేతం చేస్తుంది. ఇది స్కాల్ప్‌లో మంటను తగ్గించి జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. బీన్స్, సీఫుడ్స్, సోయా ప్రాడక్ట్స్ లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది.
/rtv/media/media_files/2024/12/07/hairfall61.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.