/rtv/media/media_files/2024/12/08/geyser11.jpeg)
అసలు గీజర్ పేలడానికి కారణమేంటి.? ఇంట్లో గీజర్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
/rtv/media/media_files/2024/12/08/geyser51.jpeg)
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గీజర్ లోపల ఉష్ణోగ్రత, ప్రెజర్ గమనీయంగా పెరిగినప్పుడు పేలిపోవడం జరుగుతుంది. గీజర్ ను ఎక్కువ సమయం పాటు ఆన్ చేసి అస్సలు ఉంచకూడదు. ఇది థర్మోస్టాట్ సిస్టమ్ పని తీరుపై ప్రభావం చూపుతుంది.
/rtv/media/media_files/2024/12/08/geyser41.jpeg)
థర్మోస్టాట్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఉష్ణోగ్రత కంటే నీరు ఎక్కువగా వేడి అవ్వడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా పెద్ద మొత్తంలో ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఇది గీజర్ లోపల ఒత్తిడిని పెంచి.. పేలుడుకు కారణమవుతుంది.
/rtv/media/media_files/2024/12/08/geyser61.jpeg)
గీజర్ పేలుళ్లను నియంత్రించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా అవసరం లేని సమయంలో గీజర్ ఆఫ్ చేయడం ఉత్తమం. దీని వల్ల పేలుడు అవకాశం ఉండదు.
/rtv/media/media_files/2024/12/08/geyser21.jpeg)
గీజర్ ను బ్లాస్ట్ నుంచి సురక్షితంగా ఉండడానికి ఇన్సులేటెడ్ పైప్స్ వాడడం సరైన ఎంపిక. ఈ పైప్స్ లోని థర్మల్ ఇన్సులేషన్ పొర నీటి ఉష్ణోగ్రతలను సరిగ్గా నిర్వహిస్తుంది. అంతేకాదు వీటి వల్ల విద్యుత్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.
/rtv/media/media_files/2024/12/08/geyser31.jpeg)
మీ ఇంట్లో గ్యాస్ గీజర్ ఉన్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండండి. గీజర్ నుంచి గ్యాస్ లీకవ్వడం చాలా ప్రమాదకరం.. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. బాత్రూమ్ లో కుళ్ళిన గుడ్ల వాసన వస్తే.. అది గ్యాస్ లీకేజ్ కి ఒక సంకేతం అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో వెంటనే గ్యాస్ ఆపేయండి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోండి.
/rtv/media/media_files/2024/12/08/geyser41.jpeg)
గీజర్ ప్రెజర్ వాల్వ్‌ను నిరంతరం తనికీ చేస్తూ ఉండాలి. వాల్వ్ గీజర్ లోపల ఒత్తిడిని బయటకు విడుదల చేస్తుంది. ఇది పాడైనప్పుడు ఒత్తిడి పెరిగి గీజర్ పేలే ప్రమాదం ఉంది.
/rtv/media/media_files/2024/12/08/ExtKtfQ7PrbqXZX4twAI.jpg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.