ప్రతి అమ్మాయికి అందంగా కనిపించాలనే కోరిక ఉండడం సహజం. అందంగా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఈ సౌందర్య ఉత్పత్తులు కొంతకాలం వరకు బాగానే ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో వీటివల్ల చర్మం, ఆరోగ్యం రెండింటికి ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.
అయితే ఈ సౌందర్య ఉత్పత్తుల్లో చాలా వరకూ నాణ్యత లేకుండా ఉంటాయి. ముఖ సౌందర్యం పై జనాలలో ఉండే అభద్రత భావాన్ని లక్ష్యంగా చేసుకొని చాలా కంపెనీలు నాసిరకం ఉత్పత్తులను మార్కెట్లలో విక్రయిస్తుంటారు. ఈ ప్రాడక్ట్స్ దీర్ఘకాలంలో చర్మానికి, ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి. అలాంటి కొన్ని సౌందర్య ఉత్పత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటిమేట్ వాష్
ఈ మధ్య మహిళల్లో ఇంటిమేట్ వాష్ వాడకం బాగా పెరుగుతోంది. ఇంటిమేట్ ఏరియాను శుభ్రంగా, తాజాగా ఉంచుకోవడానికి మహిళను దీనిని ఉపయోగిస్తారు . అయితే ఇలాంటి కెమికల్స్ తో కూడిన వాష్ లను వాడడం వల్ల యోని pH ప్రభావితం అవుతుంది. ఇది యోని ప్రాంతంలో దురద, మంట, ఇన్ఫెక్షన్ కలిగించే ప్రమాదం ఉంది.
ఫెయిర్ నెస్ క్రీమ్
చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా వాడే బ్యూటీ ప్రాడక్ట్స్ లో ఫెయిర్ నెస్ క్రీమ్ ఒకటి. మార్కెట్లలో రకరకాల స్కిన్ బ్రైటెనింగ్ క్రీములు అందుబాటులో ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే నాణ్యమైనవి.. చర్మానికి మంచివి. కొన్ని స్కిన్ లైటనింగ్ క్రీమ్లు చాలా ప్రమాదకరమైనవి. బ్లీచింగ్ ఏజెంట్స్ కలిగి తక్షణ మెరుపును అందిస్తాయి. కానీ దీర్ఘకాలంలో ఇవి చర్మాన్ని పాడు చేస్తాయి. అంతేకాదు వీటిలోని రసాయనాలు మూత్రపిండాలు, మెదడును కూడా ప్రభావితం చేస్తాయి.
హేయిర్ డైస్
మహిళలు, పురుషులు ప్రతీ ఒక్కరు హెయిర్ డై వాడతారు. అయితే దీనిలోని ప్రమాదకరమైన రసాయనాలు దీర్ఘకాలంలో జుట్టు రాలడాన్ని మరింత పెంచుతాయి. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. కృత్రిమ హెయిర్ డై బదులు సహజమైన హెన్నా, ఉసిరి వంటి వాటిని వాడడం మంచిది.
వాక్స్ క్రీమ్
శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ లో జుట్టు తొలగించడానికి మహిళలు హేయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే ఈ క్రీమ్స్ చాలా ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేయబడతాయి. ఇవి చర్మం పై చికాకు, దురద, నల్లబడడం వంటి సమస్యలను కలిగిస్తాయి. అలాగే అప్లై చేసినప్పుడు చర్మంలోకి వెళ్లి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి బదులుగా వాక్సింగ్, షేవింగ్ వంటివి సరైన ఎంపిక
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.