కృష్ణ జింకలు.. వాటి ప్రత్యేకమైన కొమ్ములకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇవి గడ్డి భూములను సారవంతంగా ఉంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. వీటి కొమ్ములు, చర్మం అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కాలేయం, గుండె జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయి.
ఈ అందమైన కృష్ణ జింకలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ జంతువులను దగ్గరగా చూడాలనుకుంటే.. భారతదేశంలోని ఈ టాప్ 5 ప్రదేశాల్లో చూడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళనాడు వల్లందు వైల్డ్ లైఫ్ సాంచురీ
వల్లందు వన్యప్రాణుల అభయారణ్యం తమిళనాడులో ఉంది. ఇది కృష్ణ జింకలను చూడడానికి చాలా ప్రత్యేకమైన ప్రదేశంగా చెబుతారు. ఇక్కడ పర్యావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణ జింకలతో పాటు వైవిధ్యమైన వన్యప్రాణులను చూడవచ్చు.
తాల్ చపర్ అభయారణ్యం, రాజస్థాన్
తాల్ చపర్ అభయారణ్యం రాజస్థాన్ లోని చురు జిల్లాలో ఉంది. ఇది జైపూర్ నుంచి 210 కి.మీ దూరంలో థార్ ఎడారి దగ్గర్లో ఉంటుంది. ప్రకృతి, వన్యప్రాణుల ప్రేముకులకు ఇది చాలా మంచి ప్రదేశంగా చెబుతారు.
జాతీయ చంబల్ అభయారణ్యం
ఈ అభయారణ్యం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మూడు రాష్ట్రాల్లోని భాగాలను కవర్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం 5,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ కృష్ణ జింకలతో పాటు ఘారియల్ మొసలి, గంగా నది డాల్ఫిన్ వంటి అరుదైన జంతువులకు ఈ అభయారణ్యం సురక్షితమైన ప్రదేశం.
పాయింట్ కాలిమెర్ వన్యప్రాణుల, పక్షుల అభయారణ్యం
తమిళనాడులోని ఈ అభయారణ్యం పాక్ జలసంధికి సమీపంలో 21.47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కృష్ణ జింకలను వీక్షించడానికి ఇది మరొక అద్భుతమైన ప్రదేశం. ముఖ్యంగా కృష్ణ జింకల పరిరక్షణ కోసం ప్రభుత్వం 1967లో ఏర్పాటు చేసింది.
వెలవాదర్ బ్లాక్‌బక్ నేషనల్ పార్క్
కృష్ణజింకలను చూడడానికి ఇదొక అద్భుతమైన ప్రదేశం. ఈ ఉద్యానవనం అధిక మొత్తంలో గడ్డి భూములను కలిగి ఉంటుంది. ఈ భూములు కృష్ణ జింకలకు సరైన ప్రదేశం. భారత దేశంలో అత్యంత కృష్ణ జింకల జనాభా కలిగిన ఒకటిగా ఈ ప్రాంతాన్ని చెబుతారు.