/rtv/media/media_files/2025/12/13/banana-protein-smoothie-2025-12-13-07-19-31.jpg)
Banana Protein Smoothie
Banana Protein Smoothie: బనానా ప్రొటీన్ స్మూతీ చాల ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది శరీరానికి కావలసిన శక్తిని వెంటనే అందిస్తుంది. ముఖ్యంగా ఉదయం అల్పాహారం ముందు లేదా వ్యాయామం తర్వాత తాగితే చాలా మంచిది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ స్మూతీని సులభంగా తాగవచ్చు.
కావలసిన పదార్థాలు:
అరటి పండ్లు - 2
పాలు - 1 కప్పు
వాల్‌నట్స్ - 10
బాదం - 10
జీడిపప్పు - 10
పీనట్ బటర్ - 1 టీస్పూన్
తేనె - 2 టీస్పూన్లు
ఐస్ క్యూబ్స్ - 5 లేదా 6
చాక్లెట్ ప్రొటీన్ పౌడర్ - 1 స్కూప్ (ఉంటే)
కోకో పౌడర్ - 1 టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా వాల్‌నట్స్, బాదం, జీడిపప్పును గంటపాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత మిక్సీ జార్‌లో అరటి పండ్లు, పాలు, నానబెట్టిన డ్రైఫ్రూట్స్, పీనట్ బటర్, తేనె వేసుకోవాలి. అవసరమైతే చాక్లెట్ ప్రొటీన్ పౌడర్, కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీని ఆన్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత స్మూతీని గ్లాసులో పోయాలి. పై నుంచి అరటి ముక్కలు లేదా తరిగిన బాదం వేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది.
ఈ స్మూతీ ప్రయోజనాలు:
ఈ బనానా ప్రొటీన్ స్మూతీ శరీరానికి శక్తిని ఇస్తుంది. ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సహజ తీపి అన్నీ ఒకే గ్లాసులో లభిస్తాయి. జిమ్ చేసే వాళ్లు, బరువు పెరగాలనుకునేవాళ్లు, అలసటగా అనిపించే వారు ఈ స్మూతీని తప్పకుండా ప్రయత్నించాలి. రోజూ ఒక గ్లాసు బనానా ప్రొటీన్ స్మూతీ తాగితే శరీరం చురుకుగా ఉంటుంది.
Follow Us