ఈ మధ్య చాలా మందికి చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల సమస్య మొదలవుతోంది. పోషకాహార లోపాలు, వయసు పై బడడం ఇలా చాలా రకాలు ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యకు దారితీస్తాయి. అయితే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనఁ పొందడానికి కొన్ని హోమ్ రెమిడీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మసాజ్
ఔషధ మూలికలు కలిగిన నూనెను గోరువెచ్చగా చేసి కీళ్ళ పై మసాజ్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఔషధ నూనె లేకపోతే ఇంట్లో దొరికే ఆవాలు లేదా నువ్వుల నూనెను వేడి చేసి అప్లై చేయండి. అలాగే అందులో 5-8 వెల్లుల్లి రెబ్బలు వేయండి.
పోషకాహారం
అధిక బరువు కారణంగా కీళ్ళ పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల నొప్పి విపరీతం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు బరువును మెయింటెయిన్ చేయాలి. ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎముకలు దృఢత్వం కోసం క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
హాట్ కోల్డ్ కంప్రెస్
హాట్ కోల్డ్ కోల్డ్ కంప్రెస్ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. జాయింట్స్ పై హాట్ కోల్డ్ కంప్రెస్ తో ప్రెస్ చేయడం వల్ల.. దాని వేడి కీళ్ల చుట్టూ ఉండే కండరాలను సడలించడానికి ఉపయోగపడుతుంది.
వ్యాయామం
కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు రోజూ కండరాళ్ళను బలోపేతం చేసే వ్యాయామాలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు మాత్రం తేలికపాటి వ్యాయామాలు చేయండి మంచిది. ఏదైనా చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.