నిద్రకు భంగం
సహజంగా జీన్స్ ప్యాంట్ టైట్ గా ఉంటుంది. కావున వీటిని ధరించి పడుకోవడం వల్ల అసౌకర్యం, చిరాకుగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. సరైన నిద్రలేకపోవడం పరోక్షంగా ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
స్కిన్ ర్యాషెస్
టైట్ జీన్స్ లు ఎక్కువ సేపు ధరించడం వల్ల తొడల మధ్య తేమ ఏర్పడుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి స్కిన్ ఇన్ఫెక్షన్, ర్యాషెస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. దురద, దద్దుర్లు వస్తాయి.
రక్తప్రసరణ
బిగుతైన జీన్సులు చర్మానికి గట్టిగా అతుక్కొని ఉండడం వల్ల రక్త ప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. శరీర భాగాలకు సరైన రక్తప్రసరణ లేకపోవడం అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. అలాగే టైట్ జీన్స్ తో నిద్రపోవడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
జీర్ణక్రియ సమస్యలు
టైట్ జీన్స్ తో పడుకోవడం వల్ల కడుపు పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తద్వారా పేగు కదలికలకు ఇబ్బంది ఏర్పడి.. జీర్ణక్రియపై దుష్ప్రభావం చూపుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
జీన్స్ ప్యాంట్స్ ఎక్కువ సమయం పాటు ధరించడం వల్ల వాటి బటన్స్, ట్యాగ్స్ కడుపుపై ఒత్తిడిని కలిగిస్తాయి. అందుకే జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించకూడదు.
నిద్రించడానికి ముందు ఎల్లప్పుడూ కాటన్, లైట్ వెయిట్, వదులైన దుస్తువులను మాత్రమే దరించాలి. ఇలాంటి బట్టలు సుఖమైన నిద్రకు సహాయపడతాయి. రక్తప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.