/rtv/media/media_files/2025/09/18/hand-dryer-2025-09-18-07-08-59.jpg)
hand dryer
Hand Dryer: ఆఫీసు లేదా పబ్లిక్ టాయిలెట్ లో చేతులు కడిగిన తర్వాత తడి చేతులను ఆరబెట్టడానికి హ్యాండ్ డ్రైయర్లను ఉపయోగించడం చాలా మందికి అలవాటు. కానీ, ఈ అలవాటే మన ఆరోగ్యానికి ముప్పని మీకు తెలుసా! ఏంటి హ్యాండ్ డ్రైయర్లతో ఆరోగ్యానికి ఎలా హానికరమని ఆలోచిస్తున్నారా? అవునండీ.. బాబూ హ్యాండ్ డ్రైయ్యర్లు ఆరోగ్యానికి సురక్షితం కాదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఏ విధంగా హ్యాండ్ డ్రైయ్యర్లు మన ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
క్రిముల వ్యాప్తి
సాధారణంగా హ్యాండ్ డ్రైయర్ల నుంచి చాలా వేగంగా గాలి బయటకు వస్తుంది. ఈ సమయంలో టాయిలెట్ లోని క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ ఫంగస్ వంటి సూక్ష్మ క్రిములు గాలిలో వచ్చి చేరుతాయి. ఇలాంటి అపరిశుభ్రమైన గాలిని పీల్చడం ద్వారా ఇన్ఫెక్షన్స్, జ్వరాలు, ఇతర అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. డ్రైయర్ల గాలి టాయిలెట్ లో సూక్ష్మక్రిముల సంఖ్యను 60 రెట్లు పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. తడిగా, మురికిగా ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ లో ఈ ప్రమాదం మరింత ఎక్కువని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అలర్జీ శ్వాసకోశ సమస్యలు
చాలా రోజుల పాటు హ్యాండ్ డ్రైయర్ల క్లీన్ చేయకపోవడం వల్ల వాటిలో దుమ్ము, దూళి, ఇతర సూక్ష్మ క్రిములు చేరుతాయి. ఇలాంటి గాలిని నేరుగా పీల్చడం ద్వారా అలర్జీలు మరియు ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగే హ్యాండ్ డ్రైయర్లు చేతులను పూర్తిగా శుభ్రం చేయలేవు. డ్రైయర్ గాలికి పెట్టినప్పటికీ చేతులు కాస్త తేమగానే ఉంటాయి. కావున హ్యాండ్ డ్రైయర్ల కంటే పేపర్ టవల్స్ వాడడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఒక అధ్యయనం ప్రకారం.. పేపర్ టవల్స్ బ్యాక్టీరియాను 77 శాతం తగ్గిస్తాయని, డ్రైయర్లు దానిని పెంచుతాయని తేలింది.
ఇన్ఫెక్షన్స్..
సరిగ్గా వెంటిలేషన్ సమయంలో హ్యాండ్ డ్రైయర్లను అస్సలు వాడకూడదు. ఇలాంటి ప్రదేశాల్లో హ్యాండ్ డ్రైయర్లు గాలి ద్వారా వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుంది.
చర్మం పొడిబారడం:
హ్యాండ్ డ్రైయర్‌ల నుండి వచ్చే వేడి గాలి మన చేతి చర్మంలోని తేమను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం పొడిగా మారి, పగుళ్లు ఏర్పడవచ్చు. దీర్ఘకాలంగా దీనిని ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
శబ్ద కాలుష్యం
కొన్ని హ్యాండ్ డ్రైయర్లు చాలా పెద్ద శబ్దంతో పనిచేస్తాయి. ఈ శబ్దం చెవులకు హాని కలిగించవచ్చు, ముఖ్యంగా పిల్లలకు ఇది మరింత ప్రమాదకరం.
ఫంగస్ వ్యాప్తి
పబ్లిక్ టాయిలెట్లలో ఉండే తేమ వాతావరణం వల్ల ఫంగస్ వృద్ధి చెందుతుంది. హ్యాండ్ డ్రైయర్లు ఈ ఫంగస్ స్పోర్స్‌ను గాలిలో వ్యాప్తి చేసి, మన చేతులపైకి చేరేలా చేస్తాయి. ఇది చర్మ సంబంధిత వ్యాధులకు దారి తీయవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, మాయో క్లినిక్ అధ్యయనాల ప్రకారం, హ్యాండ్ డ్రైయర్ల కంటే కాగితపు తువ్వాళ్లు చేతులు ఆరబెట్టడానికి ఉపయోగించడం సురక్షితం. ఎందుకంటే అవి తేమను త్వరగా గ్రహిస్తాయి అలాగే క్రిముల వ్యాప్తిని తగ్గిస్తాయి.