/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/exhausted-stressed-young-woman-sitting-on-sofa-at-2022-11-15-04-06-07-utc-scaled.webp)
నిద్ర లేకపోవడం
మెదడు పనితీరుకు సరైన నిద్ర తప్పనిసరి అవసరం. రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఉండడం మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 8-9 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/headphones-are-better-than-ear-phones-says-doctors-know-the-reason-here-telugu-news-jpg.webp)
హెడ్ ఫోన్లలో అధిక వాల్యూమ్‌తో వినడం
కొంతమందికి హెడ్ ఫోన్స్ లో గట్టిగా సౌండ్ పెట్టుకొని వినే అలవాటు ఉంటుంది. అరగంటకు పైగా హెడ్ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడు నరాలలో సమస్యలు మొదలవుతాయి. క్రమంగా ఇది మెదడు పనితీరును దెబ్బతీస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cdf3d39ab92049db2a5c1ede152f8ff41719815654064706_original-1.jpg)
అధిక స్క్రీన్ సమయం
అధ్యనాల ప్రకారం అధిక స్క్రీన్ టైం, మొబైల్స్ ఎక్కుగా చూడడం అభ్యాసం, జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యాన్నిప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/sleep-4.jpg)
చీకటిలో గడపడం
సాధారణంగా కొంతమంది ఎక్కువగా చీకటిలో ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పుడు ఇంట్లో లైట్లు ఆఫ్ చేయడం చేస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువసేపు చీకటిలో ఉండటం వల్ల మెదడు నిర్మాణంలో మార్పులు వస్తాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి అభ్యాస సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T082523.968.jpg)
ప్రతికూల విషయాలు వినడం
నిత్యం నెగెటివ్ వార్తలు వినడం వల్ల మెదడు కూడా దెబ్బతింటుంది. నెగటివ్ విషయాలను వినడం ద్వారా నిత్యం మనసులోకి ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఇది నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలను పెంచుతుంది. వయసు పెరిగే ఈ సమస్యలు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి.