Rainy Season: వర్షాకాలంలో ఈ ఆహారాలను తినేటప్పుడు జాగ్రత్త..!

వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. స్ట్రీట్ ఫుడ్స్, సముద్రపు ఆహారాలు, కట్ చేసి ఉంచిన పండ్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సీఫుడ్స్ త్వరగా కలుషితమవుతాయి.

New Update
rainy season foods

rainy season foods

Rainy Season: వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో తినే ఆహారం, పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే వ్యాధులు త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ రైనీ సీజన్ లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

కోసిన పండ్లు

ఏ సీజన్ లోనైనా కోసి ఉంచిన పండ్లను తినకపోవడం మంచిది. బయట కట్ చేసి పెట్టిన పండ్లను ఫ్రూట్ బౌల్ రూపంలో అమ్ముతుంటారు. పండ్లను కోసి ఆరుబయట ఉంచడం వల్ల.. వాటిపై ఈగలు, దోమలు వాలుతాయి. ఈ ఈగలు వాలిన వాటిని మళ్ళీ మనం తినడం ద్వారా జ్వరాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.

స్ట్రీట్ ఫుడ్

చాలా మంది స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చల్ల చల్లని వెదర్ లో బయట దొరికే వేడి వేడి బజ్జీలు, చాట్, పానీ పూరి తినాలని అందరికీ అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో స్ట్రీట్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు నిపుణులు. బయట ఉండే అపరిశుభ్రమైన పరిసరాల కారణంగా ఈ ఆహారాలు కలుషితమయ్యే పేరంటం ఉంటుంది.

ఆకు కూరలు

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల క్యాబేజీ, ఆకుకూరలు, పాలకూర వంటి వాటిలో బాక్టీరియా , పరాన్న జీవులు పెరగడం ప్రారంభమవుతుంది. ఇలాంటి కూరగాయలను సరిగ్గా శుభ్రం చేయకుండా తినడం ద్వారా కడుపులో సమస్యలను కలిగిస్తాయి. తద్వారా జీర్ణక్రియకు సమస్యలు తలెత్తుతాయి. అందుకే వర్షాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉండడం మంచిదని చెబుతారు.

సముద్రపు ఆహారాలు

వర్షాకాలంలో సముద్రపు ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. చేపలు, పీతలు, రొయ్యలు మొదలైన సీఫుడ్స్ వర్షాకాలంలో సులభంగా కలుషితమవుతాయి. వీటిని తినడం ద్వారా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు తినే వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించవచ్చు.

పాల ఉత్పత్తులు

వర్షాకాలంలో పాల ఉత్పత్తులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్లలో ఉత్పత్తుల తయారీ ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల.. ఇవి త్వరగా కలుషితమవుతాయి. వీటిని తినడం వల్ల వ్యాధుల ప్రమాదం మరింత పెరుగుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు