శరీరానికి తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రతీ ఒక్కరు రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే నిలబడి నీళ్లు తాగడం వల్ల మోకాళ్ళ పై చెడు ప్రభావం చూపుతుందని.. ఎముకలు త్వరగా బలహీనపడతాయని కొంతమంది చెబుతారు. నిలబడి తాగినప్పుడు నీరు నేరుగా మోకాళ్ళు, కీళ్ళలోకి వెళ్తుందని .. దాని ద్వారా కీళ్ల నొప్పుల సమస్య మొదలవుతుందని అంటారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిలబడి నీళ్లు కీళ్ల నొప్పులు వస్తాయనే రుజువు ఎక్కడా లేదు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి మనం తీసుకునే ప్రతీ ఆహరం ఆహార పైపు ద్వారా నేరుగా కడుపులోకి చేరుతుంది.
ఆ తర్వాత జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కావున నిలబడి తాగడం ద్వారా నీరు మోకాళ్లలోకి లేదా కీళ్లలోకి ప్రవేశించడం అనేది అసాధ్యం. వైద్యపరంగా కూడా రుజువు లేదు.
అయితే నీటిని ఎల్లప్పుడూ కూడా నిదానంగా తాగాలి. అలాగే నీరు చాలా తక్కువ పరిమాణంలో లేదా ఎక్కువ పరిమాణంలో తాగకూడదు. ఈ రెండూ ఆరోగ్యానికి హానికరం.
ఎల్లప్పుడూ నీటిని ప్రశాంతంగా కూర్చొని తాగాలి. భోజనానికి అరగంట ముందు, భోజనానికి అరగంట తర్వాత నీళ్లు తాగడం మంచిది. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.