దీపావళి, హిందువులకు అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన, దీపాలు వెలిగించి, శ్రీ లక్ష్మీ-గణేశుడుని, సంపదలకు రాజైన కుబేరుడిని పూజించడం ద్వారా ఆనందం, శ్రేయస్సును పొందుతారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పూలతో, దీపాలతో, అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు.
అయితే దీపావళి రోజున ఏదైనా కొత్త వస్తువును కొనుగులు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా బంగారం, వెండి, వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా లక్ష్మీ, కుబేరులు ప్రసన్నమవుతారని విశ్వాసం. ఒకవేళ వీటిని కొనుగోలు చేయలేకపోతే.. ఈ మూడు వస్తువులను కొనుగోలు చేసిన కూడా శుభం కలుగుతుందని నమ్మకం.
ఉప్పు
దీపావళి పర్వదినాన ఉప్పు కొనడం శుభప్రదంగా భావిస్తారు. దీపావళి రోజున కొనుగోలు చేసిన ఉప్పును ఇంటి ముఖ ద్వారం వద్ద ఉంచడం ద్వారా సానుకూల వాతావరం ఉంటుంది. అయితే ఉప్పుకు ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి ఉండడంతో.. ఇంట్లో శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు.
పచ్చ కర్పూరం
పచ్చ కర్పూరం సాధారణ కర్పూరం కంటే ఎక్కువ వాసనను కలిగి ఉంటుంది. దీపావళి పర్వదినాన ఈ కర్పూరాన్ని వెలిగించడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్మకం. అలాగే సంపద, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం.
నల్ల పసుపు
దీపావళి రోజున నల్ల పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పూజలో లక్ష్మి దేవి ముందు ఉంచిన నల్ల పసుపును.. ఆ తర్వాత డబ్బు వద్ద లేదా ఇంట్లో ఏదైనా మంచి ప్రదేశంలో ఉంచడం ద్వారా ఆర్ధిక సమస్యలు తొలగి .. సుఖ సంతోషాలు కలుగుతాయని చెబుతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.