కమ్యూనికేషన్ గ్యాప్
డిస్టెన్స్ రిలేషన్ షిప్లో వీలైనంత వరకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. తరచూ భాగస్వామికి ఫోన్ చేయడం, మాట్లాడడం ద్వారా ఇద్దరి మధ్య బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఒకరి పై ఒకరికి నమ్మకం పెరగడంతోపాటు ఒక అవగాహన ఉంటుంది. లేదంటే దూరం పెరిగే ప్రమాదం ఉంటుంది.
పొసెసివ్
ఏ రిలేషన్ షిప్ లోనైనా మితిమీరిన పొసెసివ్ నెస్ పనికిరాదు. ఇది బంధాన్ని చేదుగా మారుస్తుంది. భాగస్వామికి స్వేచ్ఛను ఇవ్వండి.. అలాగే వారి వ్యక్తిగత సమయాన్ని గౌరవించండి.
గౌరవించకపోవడం
భాగస్వామి కలలు, అభిరుచులను గౌరవించడం, ప్రాధాన్యత ఇవ్వడం రిలేషన షిప్ లో చాలా ముఖ్యమైనది. మీ భాగస్వామి ఎల్లప్పుడూ మీకు నచ్చినట్లుగా మాత్రమే ఉండాలనుకోవడం బంధంలో ఇబ్బందులను కలిగిస్తుంది.
ట్రాన్స్పరెంసీ
డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో భార్య భర్తల మధ్య పారదర్శకత అనేది చాలా ముఖ్యం. ప్రతీ విషయాన్ని దాచకుండా భాగస్వామితో పంచుకోవడం ద్వారా అపార్థాలు తలెత్తవు.
అనుమానం
ప్రతీ బంధంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకం లేని బంధం ఎక్కువకాలం నిలబడుదు అని చెబుతారు. ముఖ్యంగా డిస్టెన్స్ రిలేషిప్ లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకరికొకరు దూరంగా ఉండడం వల్ల బాగస్వాముల్లో రకరకాల ఆలోచనలకు దారితీస్తుంది. దీని కారణంగా పదే పదే భాగస్వామిని అనుమానించడం వల్ల చిరాకు, ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది బంధాన్ని ముక్కలు చేస్తుంది.
కలవడం
డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో కేవలం వర్చువల్ కనెక్షన్లపై ఆధారపడకుండా.. వీలైనప్పుడల్లా భాగస్వామిని కలవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల బంధం బలంగా ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.