ఈ మధ్య కాలం చాలా మంది జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్ల కారణంగా తరచూ జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో తో బాధపడే వారికి అద్భుతమైన చిట్కా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకోండి.
సాధారణంగా బిర్యానీ ఆకును వంటకాల రుచిని పెంచే ఒక మాసాలగా వాడతాము. అయితే ఈ బే ఆకుతో జీర్ణక్రియ సమస్యలకు ఇట్టే చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు.
బే ఆకులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. రోజూ తినే ఆహారంలో దీనిని తీసుకోవడం ద్వారా గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంతేకాదు బిర్యానీ ఆకులోని పుష్కలమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి.. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
బిర్యానీ ఆకులోని యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఈ ఆకులతో చేసిన కషాయం దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బిర్యానీ ఆకుల కషాయం శ్వాసకోశ వ్యవస్థను క్లియర్ చేయడం, ముక్కు దిబ్బడను నివారించడంలో సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.