Sravana Masam: శ్రావణ మాసం శివుడికి ఎంతో ఇష్టమైన మాసం. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా భక్తులు భోలేనాథున్ని ఆరాధించడం ప్రారంభిస్తారు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు చాలా ప్రత్యేకమైనవి. శ్రావణ సోమవారం రోజు, మహిళలు భోలేనాథ్‌ను స్వచ్ఛమైన హృదయంతో పూజిస్తూ.. ఉపవాసాలు ఉంటారు. భోలే బాబాను హృదయపూర్వకంగా పూజించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని, శుభం కలుగుతుందని చెబుతారు. ఈ రోజున, పెళ్లికాని స్త్రీలు మంచి వరుడి కోసం ఉపవాసం ఉంటారు. కావున వివాహిత స్త్రీలు కూడా సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఉపవాసం ఉంటారు. వ్రతానికి ముందు అందరూ శివలింగానికి నీరు సమర్పించి.. ఆ తర్వాత ప్రసాదం నైవేద్యంగా అందిస్తారు. చేస్తారు. అయితే శివుడికి నైవేద్యంగా ఫలహరి బంగాళాదుంప హల్వాను సమర్పించండి. దీన్ని ఇంట్లోనే త్వరగా చేసుకోవచ్చు. బంగాళాదుంప హల్వాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము
బంగాళదుంపకు కావాల్సిన పదార్థాలు
- ఉడికించిన బంగాళదుంపలు- 4
- స్వచ్ఛమైన దేశీ నెయ్యి
- చక్కెర - 1 కప్పు
- పాలు - 1 కప్పు
- యాలకుల పొడి- అర టీస్పూన్
- సన్నగా తరిగిన బాదం - 4
- పిస్తాపప్పులు - 4 సన్నగా తరిగిన
- జీడిపప్పు- 4 సన్నగా తరిగిన
- కుంకుమపువ్వు- - రంగు కోసం
బంగాళాదుంప హల్వా తయారీ విధానం
- బంగాళదుంప హల్వా చేయడానికి, ముందుగా బంగాళాదుంపలను కడిగి ఉడకబెట్టాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా స్మాష్ చేసుకోవాలి.
- ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో దేశీ నెయ్యి వేసుకొని . మెత్తగా చేసిన బంగాళదుంపలను కాసేపు నెయ్యిలో వేయించాలి. వేయించేటప్పుడు కలుపుతూ ఉండాలని గుర్తుంచుకోండి.
- ఆ తర్వాత అందులో పంచదార వేయాలి. బాగా మిక్స్ చేసి మళ్లీ కాసేపు వేయించాలి. బంగాళదుంప మిక్స్ బాగా వేగిన తర్వాత అందులో పాలు వేయాలి. కొంతమంది పాలకు బదులుగా ఖోయాను కూడా ఉపయోగిస్తారు.
- ఇక చివరగా యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. పాలు ఆరిపోయాక బాదం, పిస్తా, జీడిపప్పు వేసి కలుపుకోవాలి. అంతే శివుడికి నైవేద్యంగా సమర్పించే బంగాళాదుంప హల్వా రెడీ.
Also Read: Friendship Day : హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే🥰.. స్నేహితుల దినోత్సవ చరిత్ర తెలుసా..? - Rtvlive.com