Egg Tawa: స్ట్రీట్ స్టైల్ ఎగ్ తవా మసాలా.. నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు 👌

ఇంట్లో సండే వచ్చిందంటే పిల్లలు ఏదో ఒక స్పెషల్ రెసిపీ కావాలని డిమాండ్ చేయడం సహజం. ఈ సారి సింపుల్ గా నిమిషాల్లో తయారు చేసుకునే ఎగ్ తవా మసాలా ట్రై చేయండి. ఈ రెసిపీ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

Egg Tawa: స్ట్రీట్ స్టైల్ ఎగ్ తవా మసాలా.. నిమిషాల్లో తయారు  చేసుకోవచ్చు 👌
New Update

Street Style Egg Tawa Masala : ఇంట్లో సండే వచ్చిందంటే పిల్లలు ఏదో ఒక స్పెషల్ రెసిపీ(Special Recipe) కావాలని డిమాండ్ చేయడం సహజం. కానీ ప్రతీ సండే చికెన్ అంటే మళ్ళీ రొటీన్ అయిపోతుంది. అందుకని సండే రోజు చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ నాన్ వెజ్ ఐటమ్(Non-Veg Item) ట్రై చేయండి. ఇది చాలా తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అదే తవా మసాలా గుడ్డు(Egg Tawa Masala). ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..

తవా మసాలా గుడ్డు కావలసిన పదార్థాలు

  • 4-5 గుడ్లు
  • కొత్తిమీర ఆకులు
  • 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు
  • చిటికెడు పసుపు పొడి
  • ఉప్పు రుచి ప్రకారం
  • 2 అల్లం ముక్కలు
  • పచ్చిమిర్చి 2-3
  • వెల్లుల్లి రెబ్బలు 2-3
  • ఒక టీస్పూన్ జీలకర్ర
  • ఒక టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర మిర్చి పొడి
  • కొత్తిమీర
  • గరం మసాలా

Egg Tawa Masala

స్ట్రీట్ స్టైల్ ఎగ్ తవా మసాలా రెసిపీ

  • ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి తొక్క తీయండి. ఆ తర్వాత గుడ్లను రెండు భాగాలుగా
  • ఇప్పుడు ఒక బాణీలో నూనె పోసి రెండు భాగాలుగా కట్ చేసిన గుడ్లను వేయాలి. వాటి పై చిటికెడు ఉప్పు, పసుపు, ఎర్ర కారం చల్లండి.
  • అవి రెండు వైపులా బంగారు రంగులోకి మారినప్పుడు, వాటిని ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు కొత్తిమీర తరుగు, రెండు మూడు పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కను మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి.
  • ఇప్పుడు మళ్ళీ బాణీలో నూనె వేసి, అది వేడెక్కిన తర్వాత, జీలకర్ర గింజలు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేయాలి.
  • ఉల్లిపాయ బంగారు రంగులోకి మారినప్పుడు, పైన తయారు చేసుకున్న కొత్తిమీర పేస్ట్ జోడించండి.
  • ఈ మిశ్రమం కాస్త ఉడికిన తర్వాత.. అందులో గరం మసాలా, ధనియాల పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసి తక్కువ మంటపై వేయించాలి.
  • మసాలా దినుసులు పాన్‌కి అంటుకుంటే కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. చివరిగా ఉడుకుతున్న ఈ మసాలా మిశ్రమంలో ఉడికించిన గుడ్లను వేయండి. అంతే మసాలా ఎగ్ తవా రెడీ. దీన్ని చపాతీ లేదా పరోటాతో సర్వ్ చేయండి.

Also Read: Skin Care: మొహం పై ముడతలకు ఈ అలవాట్లే కారణం..! త్వరగా మానుకోండి

#sunday-special #egg-recipe #egg-tawa #egg-tawa-masala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe