Stress: ఒత్తిడిని తగ్గించే ప్రెజర్ పాయింట్స్.. రోజూ ఈ భాగాలను మసాజ్ చేయండి

ఒత్తిడి అనేది వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యం పై లోతైన ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని స్ట్రెస్ రిలీఫ్ వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. దవడ జాయింట్‌ను వృత్తాకార కదలికలో మసాజ్ చేయడం, కనుబొమ్మల మసాజ్ ఒత్తిడిని తగ్గిస్తాయి.

Stress: ఒత్తిడిని తగ్గించే ప్రెజర్ పాయింట్స్.. రోజూ ఈ భాగాలను మసాజ్ చేయండి
New Update

Stress: నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది ఒత్తిడి సమస్యతో బాధపడేవారు ఉన్నారు. పని, ఆరోగ్యం, ఫ్యామిలీ, డబ్బు ఇలా ఏదో ఒక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి అనేది కేవలం మానసికంగా మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం పై కూడా లోతైన ప్రభావం చూపుతుంది. దీని కారణంగా BP, షుగర్ వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే కొన్ని స్ట్రెస్ రిలీఫ్ వ్యాయామాల ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చని చెబుతున్నారు నిపుణులు. శరీరంలోని ఈ ప్రెజర్ పాయింట్స్  మసాజ్ చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

దవడ మసాజ్

జీవితంలో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు.. ప్రతిరోజూ కొంత సమయం పాటు ఈ దవడ మసాజ్ చేయడం మంచి ఫలితాన్ని అందిస్తుంది. దీని కోసం.. పళ్లను బిగించి.. దవడ జాయింట్‌ను వృత్తాకార కదలికలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

publive-image

మెడ ,భుజాలు

పని భారం ఎక్కువైనప్పుడు మెడ ,భుజాల భాగంలో నొప్పి మొదలవుతుంది. ఇది ఒత్తిడికి దారితీస్తుంది. ఈ రకమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ భుజాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, భుజాలను కదిలించడం చేయాలి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

కనుబొమ్మ 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కనుబొమ్మలను మసాజ్ చేయడం వల్ల కోపం, చిరాకు వల్ల కలిగే ఒత్తిడి తగ్గుతుంది. దీని కోసం రెండు కనుబొమ్మలను వేళ్ళతో పట్టుకుని, నుబొమ్మల మధ్యలో నుంచి వాటిని నొక్కుతూ మసాజ్ చేయాలి. ఇలా 5 నుంచి 7 నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మనసు తేలికగా మారుతుంది.

Also Read: Ram Charan- Upasana: క్లీంకార కేర్ టేకర్ మాటలు వింటే చెర్రీని మెచ్చుకోకుండా ఉండలేరు 🥰.. ఏం అన్నారంటే? - Rtvlive.com

#stress-relief-techniques #stress-relief-pressure-points
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe