Parenting Guide: కొత్త తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ గురించి తరచుగా గందరగోళానికి గురవుతారు. ఇంట్లోని పెద్దలు, చుట్టుపక్కల వారు ఎన్నో రకాల సలహాలు ఇస్తుంటారు. ఈ రోజుల్లో పిల్లలను ఎలా పెంచాలి, వారికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..? ఇలా ప్రతీది సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సులభంగా సేకరించవచ్చు. కానీ ఆ సమాచారం ఎంత వరకు సరైనది అనేది కూడా తెలుసుకోవాలి. వాటిలో కొన్ని ఒప్పు ఉండొచ్చు కొన్ని తప్పులు కూడా ఉండవచ్చు. అంతే కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ లో దొరికే సమాచారం వైద్యులు అభిప్రాయం పూర్తిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే చాలా మంది న్యూ బోర్న్ పేరెంట్స్ తమ పిల్లల విషయంలో కొన్ని అపోహలను కలిగి ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము
దంతాలు బయటకు రాగానే టూత్‌పేస్ట్ ఇవ్వడం
3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే టూత్‌పేస్ట్ ఇవ్వాలని వైద్యుల సూచన. చిన్నపిల్లల అధికంగా టూత్ పేస్ట్ వాడడం వల్ల వారి శాశ్వత దంతాలు రంగు మారే అవకాశం ఉంది. 3 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు చిన్న బఠాణి సైజ్ అంతా పేస్ట్ మాత్రమే వాడాలి.
శిశువును వాకర్‌లో ఉంచడం వల్ల వేగంగా నడుస్తారు
పిల్లలను వాకర్ లో నడిపించే అలవాటును వైద్యులు తరచుగా నిరాకరిస్తారు. చిన్నప్పుడు పిల్లల ఎత్తు వాకర్ కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల వాళ్లు కాళ్ళు పైకి ఎత్తి టోస్ (toes) పై నడవడానికి ప్రయత్నిస్తారు. పెద్దయిన తర్వాత కూడా వారికి ఇలా కాళ్లు పైకి ఎత్తి నడిచే అలవాటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
కాటుక పూస్తే కళ్లు పెద్దవిగా అవుతాయి
పిల్లల కళ్లపై కాటుక తప్పనిసరిగా పూయాలని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. దీంతో పిల్లల కళ్లు పెద్దవిగా మారుతాయి అని అభిప్రాయపడతారు. ఇది పూర్తిగా తప్పు. కాటుక కళ్లపై పూయడం వల్ల కళ్ళ సైజ్ లో ఎలాంటి మార్పులు ఉండవని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కళ్ళు జన్యుపరంగా అతని తల్లిదండ్రులతో సమానంగా ఉంటాయి.
మొబైల్ ఫోన్
చిన్న పిల్లలు నిత్యం మొబైల్ ఫోన్లు చూస్తూ ఉంటే అది వారిని శారీరకంగా ప్రభావితం చేయడమే కాకుండా మానసికంగా కూడా బలహీనం చేస్తుంది. ఎక్కువ స్క్రీన్ టైం పిల్లలో ఊబకాయం ప్రమాదానికి కూడా దారితీస్తుంది. అలాగే మొబైల్ ఫోన్స్ కారణంగా పిల్లలకు మాటలు ఆలస్యం అవుతాయి.
ఏ వయసులో పిల్లలకు సాలిడ్ ఫుడ్ ఇవ్వాలి
ఆరు నెలల తర్వాత పిల్లలకు పాలతో పాటు ధాన్యాలు, పండ్లు వంటివి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే పాలు అన్ని పోషకాలను అందించవు. దీని కారణంగా బిడ్డ రక్తహీనత వంటి వ్యాధుల బారిన పడవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Hacks: మార్కెట్ లో కల్తీ పండ్లు, కూరగాయలను ఇలా గుర్తించండి..? - Rtvlive.com