India's Haunted Places: ఇవి అత్యంత భయానక ప్రదేశాలు.. దెయ్యాలు, ఆత్మలు నివసిస్తాయని..! భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను అత్యంత భయానక ప్రదేశాలుగా పిలుస్తారు. ఆ ప్రదేశాలలో దెయ్యాలు, ఆత్మలు నివసిస్తాయని చెబుతారు. త్రీ కింగ్స్ చర్చి, నేషనల్ లైబ్రరీ (కోల్‌కతా), మహిమ్స్ డిసౌజా చాల్, ఫిరోజ్ షా కోట్లా ఫోర్ట్ ను అత్యంత భయానక ప్రదేశాలుగా పరిగణిస్తారు. By Archana 26 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి India's Haunted Places: భారతదేశం ఒక అందమైన దేశం, ఇక్కడ సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉంటాయి. ఎంతో అందమైన చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, జలపాతాలు, బీచ్ లు, ఎడారులు ఉన్నాయి. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా అందమైన ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. అయితే భారతదేశంలో ఎంతో అందమైన ప్రదేశాలతో పాటు కొన్నిభయానక ప్రదేశాలు కూడా ఉన్నాయి. అత్యంత భయానక ప్రదేశాల జాబితాలో భారతదేశంలోని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశాలలో దెయ్యాలు, ఆత్మలు నివసిస్తాయని చెబుతారు. అలాంటి భయానక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మహిమ్స్ డిసౌజా చాల్, ముంబై ఇది ముంబైలోని భయానక ప్రదేశాలలో ఒకటి. ముంబైలోని మాహిమ్ ప్రాంతంలో ఉన్న డిసౌజా చాల్ ను హాంటెడ్ ప్లేస్ గా పిలుస్తారు. కొన్నాళ్ల క్రితం ఈ చాల్ కు దగ్గరలో ఉన్న ఒక బావిలో ఓ మహిళ నీరు తీస్తుండగా బావిలో పడింది. ఆమె సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ రాకపోవడంతో చివరకు చనిపోయింది. దాంతో ఆ బావి దగ్గరే ఆ మహిళ ఆత్మ తిరుగుతుందని ప్రజలు అంటున్నారు. నేషనల్ లైబ్రరీ, కోల్‌కతా ఈ ప్రదేశం ఆసక్తికరమైన దెయ్యాల కథలకు ప్రసిద్ధి చెందింది. ఈ లైబ్రరీ పునరుద్ధరణ సమయంలో జరిగిన ప్రమాదంలో దాదాపు 12 మంది చనిపోయారు. దీని తర్వాత ఈ ప్రదేశం హాంటెడ్ ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డులు నైట్ డ్యూటీకి దూరంగా ఉంటారు. ఫిరోజ్ షా కోట్లా ఫోర్ట్, న్యూఢిల్లీ బహదూర్ షా జఫర్ రోడ్‌లో ఉన్న ఫిరోజ్ షా కోట్లా కోట కూడా హాంటెడ్ ప్లేస్‌గా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో "జిన్స్" (పారానార్మల్ ఎంటిటీలు) వెంటాడుతున్నాయని నమ్మే వ్యక్తుల కూడా ఉన్నారు. త్రీ కింగ్స్ చర్చి, గోవా ఇది గోవాలోని చర్చి, దీనిని చూడటానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రదేశంలో కొన్ని అసాధారణ సంఘటనలు జరగడం చాలా మంది చూశారు. ఈ చర్చి ఆస్తి కోసం ముగ్గురు రాజులు ఒకరితో ఒకరు పోరాడి చంపుకున్నారని చెబుతారు. ఆ తర్వాత వారి ఆత్మలు చర్చి లోపల తిరుగుతూ ఉన్నాయని పుకార్లు. Also Read: Javed Akhtar: దానికి బానిసనై.. పదేండ్ల సమయాన్ని వృథా చేశా! జావేద్ అక్తర్ కామెంట్స్ - Rtvlive.com #haunted-places-in-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి