Cooler: కూలర్ లో గడ్డిని ఎప్పుడు మార్చాలి..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.! వేసవిలో ప్రతీ ఇంట్లో కూలర్లు వినియోగం బాగా పెరిగిపోతుంది. కూలర్ ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కూలర్ ద్వారా వచ్చే చల్లని గాలి దానిలోని గడ్డి పై ఆధారపడి ఉంటుంది. ప్రతి రెండు సీజన్లలో ఒకసారి కూలర్ గడ్డిని మార్చడం మంచిది. లేదంటే దుమ్ము పేరుకుపోయి చల్లని గాలి రాదు. By Archana 30 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Cooler: వేసవి కాలంలో చల్లటి గాలి తక్కువగా ఉంటుంది. మండే ఎండలకు ఇంట్లో ఉక్కపోత, విపరీతమైన వేడి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రతీ ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు వినియోగం పెరుగుతుంది. అయితే కూలర్లను ఉపయోగించే ముందు దాన్ని సరైన పద్దతిలో ఉంచడం కూడా చాలా ముఖ్యం. లేకపోతే అవి గదిని సరిగ్గా చల్లబరచవు. కూలర్ ద్వారా వచ్చే చల్ల గాలి దాని లోపలి గడ్డి పై ఆధారపడి ఉంటుంది. గడ్డిని అమర్చే విషయంలో తప్పులు చేస్తే గాలి చల్లగా వీచే అవకాశం ఉండకపోవచ్చు. దీని కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.. కూలర్ లో గడ్డిని ఎప్పుడు మార్చాలి చల్లని గాలికి అత్యంత ముఖ్యమైనది దాని గడ్డి. గడ్డి బాగా లేకుంటే చల్లటి గాలి దొరకదు. అందువల్ల, మీరు వేసవి సీజన్‌లో కూలర్‌ను ఉపయోగించాలని భావించినప్పుడు, మొదట దాని గడ్డి పరిస్థితిని చెక్ చేయండి. గడ్డిపై దుమ్ము పూర్తిగా పేరుకుపోతే, దాని ద్వారా గాలి సరిగ్గా ప్రసరించదని అర్థం. గాలి సరిగ్గా గడ్డి గుండా వెళ్ళకపోతే గది చల్లబడదు. కొందరు వ్యక్తులు 3-4 సంవత్సరాలు ఒకే గడ్డితో కూలర్ నడుపుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ప్రతి రెండు సీజన్లలో ఒకసారి కూలర్ గడ్డిని మార్చడం మంచిది. కూలర్‌లోని గడ్డి నల్లగా మారడం, దుమ్ముతో పూర్తిగా మూసుకుపోయినట్లు గమనించినట్లయితే, ఇది గడ్డిని మార్చడానికి సంకేతం. కూలర్ గడ్డిని రూ.80 నుంచి రూ.100 వరకు పొందవచ్చు. అయితే, మీ ప్రాంతంలో చల్లటి గడ్డి ధర కొంచెం ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. Also Read: Cool Drinks: వేసవిలో కూల్ డ్రింక్స్ గ్లాసులు గ్లాసులు తాగుతున్నారా..? ఇక మీ లివర్ పాడైనట్లే జాగ్రత్త..! #cooler #cooling-pads మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి