Artificial sweeteners: షుగర్-ఫ్రీ స్వీటెనర్స్ తో ప్రమాదం..! స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధుల అవకాశం..!

షుగర్-ఫ్రీ స్వీటెనర్‌లు అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి సహాయపడతాయని భావిస్తారు. కానీ వీటిని అతిగా తీసుకోవడం జీర్ణవ్యవస్థ, ప్రేగు బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

Artificial sweeteners: షుగర్-ఫ్రీ స్వీటెనర్స్ తో ప్రమాదం..! స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధుల అవకాశం..!
New Update

Artificial sweeteners: ఆరోగ్యానికి షుగర్ వల్ల కలిగే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఫిట్‌నెస్ ఫ్రీక్ ప్రజలు ఆర్టిఫీషియల్ స్వీటెనర్ లేదా షుగర్ ఫ్రీ పిల్స్‌ తీసుకోవడం చేస్తుంటారు. షుగర్ ఫ్రీ పిల్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయని భావిస్తారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వారి ఆహారంలో స్వీట్ కోసం ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ స్టెవియా, షుగర్ ఫ్రీ పిల్స్ వాడడం చేస్తుంటారు.

ఆర్టిఫిషియల్ స్వీటెనర్

అయితే తాజాగా దీనికి సంబంధించిన పరిశోధన పై WHO నివేదికను వెల్లడించింది. WHO నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ ప్రమాదకరమైన వ్యాధిలో ఇన్సులిన్ స్థాయి అసమతుల్యమవుతుంది. WHO తన నివేదికలో సహజమైన లేదా ఏదైనా కృత్రిమ స్వీటెనర్‌ను ఆహార పదార్థాలలో ఉపయోగించరాదని పేర్కొంది.

కెనడాలోని మానిటోబా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధన ప్రకారం, కృత్రిమ స్వీటెనర్లు జీర్ణవ్యవస్థ, ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీని కారణంగా వ్యక్తి ఆకలి ప్రభావితమవుతుంది. ఈ కృత్రిమ స్వీటనర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధుల వచ్చే ప్రమాదం ఉంది. కృత్రిమ స్వీటెనర్లలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ.. అవి ఆరోగ్యానికి అనేక దుష్ప్రభావాలను తెస్తాయి. వీటిలో ఉండే రసాయనాలు శరీరంలో వాపులు కలిగించడంతోపాటు కాలేయాన్ని కూడా బలహీనపరుస్తాయి.

publive-image

ఆర్టిఫిషియల్ స్వీటెనర్, షుగర్ ఫ్రీ మాత్రలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.

ఊబకాయం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కృత్రిమ స్వీటెనర్లను వినియోగిస్తున్నప్పుడు, వ్యక్తి మెదడుకు తక్కువ కేలరీలు ఉన్నాయని సందేశం పంపబడుతుంది. దీని కారణంగా వ్యక్తి దానిని ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తాడు. తద్వారా ఆకలిని పెంచి.. ఊబకాయం సమస్యను పెంచుతుంది. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వారి పరిశోధన ప్రకారం, షుగర్ ఫ్రీ బరువు తగ్గడంలో ఏమాత్రం సహాయపడదు. ఇది జీవక్రియ, ఆకలిపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది.

అధిక రక్త పోటు

షుగర్ ఫ్రీ మాత్రలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కృత్రిమ తీపి పదార్థాలతో తయారు చేసిన పానీయాలను రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా తీసుకునే వ్యక్తుల్లో అధిక రక్తపోటు, గుండె సమస్యలు, కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

అలెర్జీలు

కృత్రిమ స్వీటెనర్‌లో ఉండే అస్పర్టమే(Aspartame) అధిక ఉష్ణోగ్రతల వద్ద ఫార్మిక్ యాసిడ్‌గా విడిపోవడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా అలెర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తలనొప్పి, వికారం, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, నెర్వస్‌నెస్ మొదలైనవి దీని సైడ్ ఎఫెక్ట్స్. ఇవి కొంతమందిలో కనిపిస్తాయి.

సలహా

షుగర్-ఫ్రీ స్వీటెనర్‌లు , మాత్రలు మితంగా ఉపయోగించడం సురక్షితమని నిపుణులు సూచన.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Migraine: ఈ ఆహార పదార్థాలు మైగ్రేన్ నొప్పిని పెంచుతాయి.. అందుకే తినవద్దు!

#artificial-sweeteners
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe