Life Style: చల్లని ఆహారంతో ఆరోగ్యానికి హాని.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

చల్లని ఆహరం తినడం ఆరోగ్యానికి హాని అంటున్నారు వైద్యులు. చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రకారం చల్లటి ఆహరం జీర్ణక్రియ పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు వెల్లడించారు. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఊబకాయం, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

New Update
Life Style: చల్లని ఆహారంతో ఆరోగ్యానికి హాని.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Life Style: సాధారణంగా కొంత మంది ఆహారాన్ని వేడిగా కంటే చల్లగా తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే చల్లటి ఆహారాన్ని తినడం అనారోగ్యానికి గురి చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రకారం చల్లని ఆహరం తినడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బలహీనమైన జీవక్రియ

చల్లని ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ బలహీనపడుతుంది. కడుపులో చల్లని ఆహారాన్ని వేడి చేయడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. దీని కారణంగా శక్తి తగ్గిపోయి కేలరీ బర్నింగ్ ప్రక్రియ మందగిస్తుంది. ఈ పరిస్థితి ఊబకాయానికి దారితీసే ప్రమాదం ఉంటుంది.

జీర్ణక్రియ 

సాధారణంగా చల్ల దానికంటే వేడిగా తిన్న ఆహరం త్వరగా జీర్ణమవుతుంది. అందువల్ల చల్లటి ఆహరం తినడం వల్ల కడుపులో అనేక సమస్యలు తలెత్తుతాయి. పొత్తికడుపులో నొప్పి, కడుపు బిగ్గరగా అనిపించడం జరుగుతుంది.

publive-image
గ్యాస్, ఉబ్బరం

చల్లటి ఆహరం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, ఊబకాయం, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

ఫుడ్ పాయిజనింగ్

సహజంగా వేడి ఆహారంతో పోలిస్తే చల్లటి ఆహారంలో బ్యాక్తీరియా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు చల్లటి రైస్ ను మళ్ళీ వేడి చేసినప్పుడు అందులో బాసిల్లస్ సెరియస్ వంటి హానికరమైన బ్యాక్టీరియాను డెవలప్ అవుతుంది. ఇది ఆహారంలో విషపూరితాలను ఉత్పత్తి చేసి.. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఊబకాయం

చల్లని ఆహరం జీర్ణక్రియను చెడుగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కడుపులోని ఆహారం సమయానికి జీర్ణం కాక బరువు పెరగడానికి కారణం అవుతుంది. అందుకే వీలైనంత వరకు ఆహారాన్ని వేడిగా, తాజాగా తినడం ఆరోగ్యానికి, శరీరానికి రెండింటికీ మంచిదని నిపుణుల సూచన.

Also Read: Bigg Boss Telugu 8: 'దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట'.. కలర్ ఫుల్ గా బిగ్ బాస్ ప్రోమో - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు