Nail Biting : గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ ప్రమాదం తప్పదు జాగ్రత్త..! గోర్లు కొరికే అలవాటు ఉందా..? అయితే ఈ ఆటవాటును మానుకోవడం మంచిది. లేదంటే తీవ్రమైన వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అసలు గోర్లు కొరకడానికి కారణమేంటి? కొరికితే ఏమవుతుంది..? తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 22 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nail Biting Habit : సాధారణంగా ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా టెన్షన్ లో ఉన్నప్పుడు గోర్లు కొరికేస్తుంటారు. అయితే దీని వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయట. చిన్నపిల్లల్లో(Small Kids) ఈ అలవాటు ఎక్కువగా గమనిస్తుంటాము. ఇలాంటి ఈ అలవాటు నుంచి వారిని మెల్లగా వేరే పనిలోకి డైవర్ట్ చేయాలి. అసలు గోర్లు కొరకడానికి కారణమేంటి గోర్లు కొరకడానికి(Nail Biting) చాలా రకాల కారణాలు ఉంటాయి. గోర్లు కొరకడాన్ని శాస్త్రీయంగా ఒనికోఫాగియా అంటారు. జన్యుపరమైన అంశాల నుంచి మానసిక పరిస్థుతుల(Physical Conditions) వరకు ఇలా చాలా పరిస్థితులు దీనికి కారణం కావచ్చు. గోర్లు కొరకడం అనేది మానసిక ఆందోళనతో ముడిపడి ఉంటుంది. గోర్లు నమలడం వల్ల ఒత్తిడి, టెన్షన్, విసుగు తగ్గుతుందని భావిస్తారు. మరి నిపుణులు ఏం చెబుతున్నారు అంటే.. భయం, నీరసం , ఒంటరితనం, పోషకాహారలోపం ఈ సమస్యకు ప్రధాన కారణాలని నివేదిస్తున్నారు. గోర్లు కొరికితే ఏమవుతుంది..? అయితే గోర్లు కొరకడం వల్ల వాటి చుట్టూ ఉన్న చర్మం దెబ్బతింటుంది. అదే విధంగా గోర్లు పెరిగేలా చేసే కణజాలం దెబ్బతింటుంది. ఈ అలవాటును దీర్ఘకాలికంగా కొనసాగిస్తే.. గోర్లలో పేరుకుపోయిన హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి వెళతాయి. తద్వారా మీరు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ అలవాటు ఎక్కువైతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రమాదకరమైన విషయమేంటంటే, ఈ అలవాటు ద్వారా దంత సమస్యలు కూడా వస్తాయని డెంటిస్టులు చెబుతున్నారు. కావున ఇప్పటికైనా గోర్లు కొరకడం ఆపండి లేదంటే మిమ్మల్ని మీరు ప్రమాదంలో వేసుకున్నట్టే. Also Read: Relationship: ప్రేమ ఉన్నప్పటికీ బ్రేకప్ అవుతుందా.. అయితే కారణాలు ఇవే..? #physical-conditions #nail-biting #small-kids మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి