Wheat Grass Juice: గోధుమ గడ్డి విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలకు పవర్‌హౌస్ గా పిలవబడుతుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే గోధుమ గడ్డి జ్యూస్ తో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము.
గాయాలు నయం
గోధుమ గడ్డి రసం గాయాలు నయం చేయడంలో సహాయపడుతుంది. ఈ రసంలోని క్లోరోఫిలిన్ కంటెంట్ గాయం నయం చేయడంలో సహాయపడే బ్యాక్టీరియోస్టాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కావున ఇది తాగడం ఆరోగ్యానికి మంచిది.
కాలేయానికి ప్రయోజనకరమైనది
గోధుమ గడ్డి రసం కాలేయానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. దీనిలోని క్లోరోఫిల్ మీ కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. గోధుమ గడ్డి రసంలోని ఇతర పోషకాలైన కోలిన్ , ఇతర మినరల్స్ కాలేయాన్ని శుద్ధి చేస్తాయి. కోలిన్ శరీరంలో ఫ్యాట్ పేరుకుపోకుండా నియంత్రిస్తుంది.
అధిక రక్తపోటు
గోధుమ గడ్డి రసంలోని పుష్కలమైన ఫైబర్ శరీరంలో కొవ్వులను తగ్గించి.. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
పుష్కలమైన పోషకాలు
గోధుమ గడ్డి కాల్షియం, ఇనుము, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, సోడియం, విటమిన్ A, C, E, కోలిన్ వంటి పుష్కలమైన పోషకాలకు గొప్ప మూలం. రోజూ ఆహారంలో దీనిని తీసుకోవడం ద్వారా పోషకాహార లోపాన్ని నియంత్రించవచ్చు.
అధిక యూరిక్ యాసిడ్
అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి గోధుమ గడ్డి రసం ఒక వరం కంటే తక్కువ కాదు. అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు గోధుమ గడ్డి రసాన్ని తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
టైప్ 2 డయాబెటిస్
టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి గోధుమ గడ్డి రసం మంచి ఎంపిక. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యం
గోధుమ గడ్డి రసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. రోగనిరోధక శక్తిని, జీర్ణక్రియ వ్యవస్థ, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో ఆక్షీకరణ ఒత్తిడి, వాపును తగిస్తుంది. కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో కడుపు పై దురద ఎక్కువైందా..! ఈ చిట్కాలు పాటించండి - Rtvlive.com